Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్‌లో విచిత్ర పరిస్థితి.. చికెన్ కంటే గుడ్డు రేటే ఎక్కువ!

సాధారణంగా కోడి మాంసం ధర గుడ్డు ధర కంటే ఎక్కువే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

By:  Tupaki Desk   |   17 May 2025 3:00 PM IST
బంగ్లాదేశ్‌లో విచిత్ర పరిస్థితి.. చికెన్ కంటే గుడ్డు రేటే ఎక్కువ!
X

సాధారణంగా కోడి మాంసం ధర గుడ్డు ధర కంటే ఎక్కువే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అక్కడ గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కోడి మాంసం సామాన్యుడికి అందుబాటు ధరలో లభిస్తోంది. ఢాకాలోని ప్రధాన కూరగాయల మార్కెట్లైన రాంపురా, మాలిబాగ్, ఖిల్గావ్ తల్తలా, షేజున్‌బాగిచాలలో శుక్రవారం ఉదయం పరిస్థితి భిన్నంగా కనిపించింది.

కేవలం ఒక వారంలో గుడ్ల ధర డజనుకు 10 టాకాలు పెరిగింది. అదే సమయంలో బ్రాయిలర్ చికెన్ ధర కిలోకు 10 నుంచి 20 టాకాలు తగ్గింది. కూరగాయల ధరలు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కూరగాయలు మాత్రమే కొద్దిగా ఊరటనిచ్చాయి.

సామాన్యుడికి భారమైన గుడ్డు

ఒకప్పుడు పేదవాడి ప్రోటీన్‌గా పిలిచే గుడ్డు ఇప్పుడు సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా పోతోంది. ప్రస్తుతం పెద్ద మార్కెట్లలో డజను గుడ్లు 140 టాకాలకు, చిన్న వీధుల్లోని దుకాణాల్లో 145 టాకాలకు అమ్ముడవుతున్నాయి. వారం క్రితం ఈ ధర 130-135 టాకాలుగా ఉండేది. మాలిబాగ్ మార్కెట్‌లోని గుడ్ల హోల్‌సేల్ వ్యాపారి అబుల్ హుస్సేన్ మాట్లాడుతూ.. రైతులు చాలా నెలలుగా నష్టాలను చవిచూశారని తెలిపారు. ఈసారి ధర కొద్దిగా పెరగడం వారికి అవసరమని ఆయన అన్నారు. చాలా ఫారమ్‌లు మూతపడ్డాయి. వర్షాకాలంలో సాధారణంగా గుడ్ల ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి ధరలు చాలా కాలం పాటు తక్కువగానే ఉన్నాయి.

‘చౌక ప్రోటీన్’గా మారిన చికెన్

గుడ్డు ధర పెరిగినప్పటికీ చికెన్ ధర తగ్గింది. బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు కిలో 160 నుంచి 180 టాకాలకు అమ్ముడవుతోంది. ఇది గత వారంతో పోలిస్తే 10-20 టాకాలు తక్కువ. అంటే ఇప్పుడు భోజనంలో కోడి గుడ్డు కంటే చాలా మంది చికెన్ తినొచ్చు. కూరగాయల మార్కెట్ పరిస్థితి మాత్రం ఇంకా కష్టంగానే ఉంది. కొన్ని వేసవిలో పండే కూరగాయలు కిలో 40-60 టాకాలకు అమ్ముడవుతున్నాయి. పొట్లకాయ,బీరకాయ, దోసకాయ, వంకాయ, బీన్స్ కిలో 50-60 టాకాలకు అందుబాటులో ఉన్నాయి. వేసవి కూరగాయల సరఫరా పెరగడం వల్ల ధరలు కొద్దిగా తగ్గాయని ప్రజలు అంటున్నారు. కానీ వర్షం పడితే మళ్లీ ధరలు పెరుగుతాయి.