Begin typing your search above and press return to search.

సెలవులకు బ్యాంకాక్‌ వెళ్తున్నారా...? కిందా... పైన చూసుకోండి

ముందుగా.. ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌...! ఈసారి పండుగ సెలవులకు బ్యాంకాక్‌ వెళ్తున్నారా...? కిందాపైన చూసుకోండి అంటూ అలర్ట్‌.

By:  Tupaki Desk   |   25 Sept 2025 4:00 AM IST
సెలవులకు బ్యాంకాక్‌ వెళ్తున్నారా...? కిందా... పైన చూసుకోండి
X

ముందుగా.. ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌...! ఈసారి పండుగ సెలవులకు బ్యాంకాక్‌ వెళ్తున్నారా...? కిందాపైన చూసుకోండి అంటూ అలర్ట్‌. చూడగానే చిత్రంగా అనిపించేలా.. వినగానే నవ్వొచ్చేలా.. ఏం జరిగిందో తెలుసుకుందాం అనిపించేలా... ఉన్న ఆ పోస్ట్‌ను తీరిగ్గా చూస్తే అసలు విషయం అర్ధమైంది...! థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ అంటే మనవాళ్లందరికీ స్వర్గమే అనే సంగతి తెలిసిందే. ‘బ్యాంకాక్‌ వెళ్తున్నా’ అనే మాట చెప్పగానే ముఖ్యంగా తెలుగువారి మొహంలో ఒక రకమైన నవ్వులాంటి భావన కనిపిస్తుంది..! దీనికి కారణంగా అక్కడి స్వేచ్ఛా జీవితమే. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో కూడా ఫన్నీ పోస్టులు పెడుతుంటారు. యూట్యూ్‌బ్‌లో ‘బ్యాంకాక్‌’ సిరీస్‌లే ఉండడం గమనార్హం.

మరిప్పుడు ఏమైంది..?

ఉన్నట్లుండి కాళ్ల కింద ఉన్న భూమి కుంగితే ఎలా ఉంటుంది..? ఇప్పడు బుధవారం బ్యాంకాక్‌లో అదే జరిగింది. ఓ భారీ రోడ్డు నిలువునా కుంగింది. స్థానికంగా ఉన్న వజీరా ఆస్పత్రి ముందు ఏకంగా 50 మీటర్ల లోతున సింక్‌ హోల్‌ ఏర్పడింది. ఇది క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిచింది. చివరకు రోడ్డు కుంగుబాటు సామ్సెన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు విస్తరించింది.

అత్యవసర పరిస్థితి..

సహజంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తుంటారు. ఇప్పుడు బ్యాంకాక్‌లోని వజీరా ఆస్ప్రతి వద్ద రోడ్డు కుంగడంతో ఎమర్జెన్సీ ప్రకటించి అటుగా ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. ఆ రోడ్డును మొత్తం మూసివేశారు. ఆస్పత్రి-సాంగ్‌ హి కూడలి, పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. స్థానిక ప్రభుత్వం నుంచి మళ్లీ ప్రకటన వచ్చేవరకు ఇటుగా ఎవరూ రావొద్దని సూచించారు.

అందుకే ఆ పోస్ట్‌...

బ్యాంకాక్‌ వెళ్లేవారు పైన కింద చూసుకుని వెళ్లండి అంటూ పైన చెప్పుకొన్న హెడింగ్‌ అర్థం ఇదే. వజీరా ఆస్పత్రి ముందు కళ్లెదుటే కుంగడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. హాహాకారాలు చేశారు. రోడ్డు తాను కుంగుతూ కరెంటు వైర్లనూ లాక్కెళ్లింది. బహుశా పెద్దగా వాహనాలు ఆ గుంతలో పడినట్లు కనిపించలేదు. కొందరు వాహనదారులు త్రుటిలో తప్పించుకున్నట్లు కనిపిస్తోంది.