Begin typing your search above and press return to search.

2 వేల నోట్లు బంద్... రూ. 1000 నోట్లు వస్తున్నాయా?

కేంద్రం ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 12:30 AM GMT
2 వేల నోట్లు బంద్... రూ. 1000 నోట్లు వస్తున్నాయా?
X

నవంబరు 8న - 2016 దాదాపు ఏమాత్రం మరిచిపోలేని రోజులో అదొకటి. ఆ రోజున భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా అప్పటివరకూ చలామణిలో ఉన్న రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకుని, కొత్త నోట్లను తీసుకోవాలని తెలిపింది.

వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లు చెలామణిలోకి తెచ్చినట్లు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య లు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో... నాడు సామాన్యుడు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదనేది తెలిసిన విషయమే. ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల రెండు వేల నోట్లను కూడా రద్దుచేసింది.

కేంద్రం ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత పెద్ద నోట్లు తిరిగి చలామణిలోకి రానున్నాయని ఊహాగానాలు ఆన్ లైన్ వేధికగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... పెద్ద నోట్లు లేని కారణంగా గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దీంతో ఈ ఊహాగాణాలపై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత నిచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా... రూ. 1,000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని తమకున్న సమాచారాన్ని ఉటంకిస్తూ ఏఎన్‌ఐ రిపోర్ట్‌ చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయాన్ని ప్రస్థావించింది!

కాగా... 2016 నవంబర్‌ లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం... క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఇటీవల రూ. 2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంది. వీటి మార్పిడికి కొంత సమయం ఇచ్చింది. ఇందులో భాగంగా... వీటి మార్పిడి కోసం తొలుత సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ణయించింది.

ఆ తర్వాత అక్టోబర్ 7 - 2023 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఇంకా ఎవరిదగ్గరైనా రూ.2000 నోట్లు ఉంటే ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్పు చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే... తిరిగి వెయ్యి నోట్లు చలామణిలోకి తేబోతున్నారా అనే చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇలా వచ్చింది!