Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ పొలిటికల్ స్కెచ్.. ఆ స్థానం నుంచి ఎంపీగా..

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయన ఏది మాట్లాడినా క్షణాల్లో సంచలనం అవుతుంది

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:50 AM GMT
బండ్ల గణేష్ పొలిటికల్ స్కెచ్.. ఆ స్థానం నుంచి ఎంపీగా..
X

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయన ఏది మాట్లాడినా క్షణాల్లో సంచలనం అవుతుంది. కాంట్రవర్సియల్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. నచ్చిన వ్యక్తులను తెగ పొగుడుతుంటారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఆయన.. జనసేన పార్టీలోకి రావాలని పవన్ అభిమానులు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన ఆ పార్టీలో చేరలేదు.

ఇక తెలంగాణలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున బండ్ల గణేష్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి కాంగ్రెస్‌ కు మద్దతుగా గళం వినిపిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బండ్ల గణేష్‌ కు కాంగ్రెస్ ఏదో ఒక పదవి ఇవ్వనుందని ప్రచారం సాగింది.

ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్‌ గా గానీ లేదా ఎమ్మెల్సీగా గానీ బండ్ల గణేష్ కు అవకాశం కల్పించనుందంటూ టాక్ వినిపించింది. కానీ కాంగ్రెస్ ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇక త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారట. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి శుక్రవారం దరఖాస్తు చేయనున్నారట.

అందుకు తన వంతు ప్రయత్నాలను కూడా బండ్ల గణేష్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ స్థానం నుంచి టికెట్ కోసం ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌ పై బరిలో నిలిచి విజయం సాధించారు.

ఇటీవల కొడంగల్ లో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత.. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి పోటీ చేస్తే.. తనకు విజయావకాాలు ఎక్కువగా ఉన్నట్లు బండ్ల గణేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఫిక్స్ అయ్యారట. మరి లోక్సభ ఎన్నికల్లో బండ్ల గణేష్ గెలుస్తారో లేదో చూడాలి.