Begin typing your search above and press return to search.

ఏదో జనరల్ గా అంటే... పవన్ కి లింక్ చేశారుగా!

నేను రోజుకి గంట మాత్రమే పుస్తకాలు చదువుతానని.. అంతే కానీ వేలల్లో, లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివాను అంటూ గొప్పలు చెప్పుకోను" అని అన్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 5:19 AM GMT
ఏదో జనరల్  గా అంటే... పవన్  కి లింక్  చేశారుగా!
X

మీడియా.. అందునా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మైకులముందు రికార్డెడ్ గా ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మస్ట్ అండ్ షుడ్! అలాకానిపక్షంలో ఆ మాటలకు ద్వంద్వార్ధాలు, నానార్ధాలు, ప్రతిపదార్ధాలు తీస్తూ.. తాత్పర్యాలు రాస్తూ.. నెటిజన్లు నెట్టింట ఒక ఆటాడేసుకుంటారు. తాజాగా బండ్ల గణేష్ విషయంలో మరో విషయం తెరపైకి వచ్చింది.

అవును... గబ్బర్ సింగ్ సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి, తన హీరోపై ఉన్న అభిమానం గురించి బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఈ స్పీచ్ కి ప్రశంసలు ఎన్ని వచ్చాయో.. ట్రోలింగ్స్ అంతకు మించి వచ్చాయని అంటుంటారు. నాటి నుంచి సినిమా వేడుకలో బండ్ల గణేష్ మైకందుకుంటే... ఆడియన్స్ ఈలలూ కేకలూ పెరిగిపోతుంటాయి. వారిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఆ ఈలలకు గణేష్ న్యాయం చేస్తుంటారు.

ఇక రాజకీయాల విషయానికొస్తే ఇటీవల కాలంలో తనదైన సంచలనాలు సృష్టిస్తున్నారు. వాస్తవానికి 2018 తెలంగాణ ఎన్నికల సమయంలోనే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటూ నెట్టింట జరిగిన ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనంతరం కేసీఆర్ ని పులి అని అంటే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ ని సింహం అని సంభోదించారు. ఇలా ఎలాగైనా ఏ విషయంపై అయినా తనదైన శైలిలో స్పందించగల నేర్పరి గణేష్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు.

ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో రోడ్లపైకి వచ్చి బండ్ల గణేష్... కీలక వ్యాఖ్యలే చేశారు. అనంతరం ఒక సమయంలో ఏపీలో జగన్‌ గారి పాలన బాగుందని.. తనకు తెలిసిన వ్యక్తికి వైద్యసాయం చేశారని.. ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడుతో సమానమని చెప్పి జగన్ మీద ప్రశంసలు కురిపించారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తనకు దేవుడని చెప్పుకునే బండ్ల గణేష్... తన సినిమాలకు కోసం ఎవరినైనా పొగుడుతానని.. అందరి హీరోలు తనకు సమానమే అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కు ఒక ప్రశ్న ఎదురైంది. అందులో భాగంగా... "సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ఫొటోలో బుక్ చదువుతూ కనిపించారంటే.. మీకు పుస్తకాలు చదవడం అంటే అంత ఇష్టమా"? అనేది ప్రశ్న!

దీనికి సమాధానంగా స్పందించిన గణేష్... "ప్రతిరోజు నేను గంటకు పైగా పుస్తకాలు చదువుతాను. అందులో ఉన్నటువంటి మంచి పాయింట్స్ నేను అండర్ లైన్ చేస్తూ ఉంటాను. ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను రోజుకి గంట మాత్రమే పుస్తకాలు చదువుతానని.. అంతే కానీ వేలల్లో, లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివాను అంటూ గొప్పలు చెప్పుకోను" అని అన్నారు. దీంతో ఈ సమాధానం వైరల్ గా మారింది.

కారణం... గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. లక్షల పుస్తకాలు చదివానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి కౌంటర్‌ గానే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటూ నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పోటీ చేయడమే ఇందుకు కారణం అని చెప్పలేము కానీ... ఏదో జరిగిందని అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ వివాదంపై గణేష్ ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది వేచి చూడాలి!