Begin typing your search above and press return to search.

రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

దీంతో “ఇంత చిల్లర వ్యాఖ్యలు ఏమిటి బండ్లా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు!!

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:14 AM GMT
రోజా పులుసు పాప.. బండ్ల గణేష్  సంచలన వ్యాఖ్యలు!
X

శృతిమించితే ఏదైనా అసహ్యంగా ఉంటుందని అంటారు.! ఇదే సమయంలో మాటకు అదుపు, పొదుపు ఉండాలని చెబుతుంటారు!! ఈ రెండూ ఎప్పుడూ వినలేదో.. లేక, వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవాలని అనుకోలేదో తెలియదు కానీ... కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన బండ్ల గణేష్... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి ఆర్కే రోజాలపై నోరు పారేసుకున్నారు. దీంతో “ఇంత చిల్లర వ్యాఖ్యలు ఏమిటి బండ్లా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు!!

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో తెలంగాణ ముఖ్యమంత్రిపై ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రేవంత్ ఓ జాక్‌ పాట్ సీఎం అని ఆమె కామెంట్ చేశారు. దీంతో ఈ విషయాలపై స్పందించిన బండ్ల గణేష్... రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం కాదని... రోజా ఎవరి వద్దైతే పనిచేస్తుందో ఆయనే జాక్ పాట్ సీఎం అని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... రేవంత్ రెడ్డి ఫైటర్ అని.. పోరాట యోధుడు అని.. భారతదేశంలో ఇలాంటి వారు అతితక్కువ మంది ఉంటారని.. పోరాడి తనేంటో నిరూపించుకుని, ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నాడని అన్నారు. తండ్రి చనిపోతే వస్తే అది యాక్సిడెంటల్ సీఎం అని అనొచ్చని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆయన.. మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "రోజా డైమండ్ రానీ అని.. ఆమెకు సీటు వస్తుందో రాదో అనేది డౌట్ అని.. రోజాలా పులుసు వండి పెడితే పదవులు వస్తాయని.. నువ్వు ఈ రోజో రేపో మాజీవి అవుతావు, అప్పుడు ఆమాజీ ఈ మాజీ కలిసి తాజాగా కిలోల కొద్దీ పులుసు వండుకోవచ్చని" కామెంట్లు చేశారు. ఇదే సమయంలో... "రోజా నువ్వు ఐటం.. ఐటం లానే ఉండు" అ బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరి ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందా.. ఈ విషయంలో బండ్లపై రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారు.. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా, వైసీపీలు ఎలా రియాక్ట్ అవుతాయనేది వేచి చూడాలి.