Begin typing your search above and press return to search.

భర్తతో చట్నీ లొల్లి.. బండ్ల గణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్ గా పని చేసే రమణ సతీమణి.. సోమవారం ఆత్మహత్య చేసుుకున్న వైనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:48 AM GMT
భర్తతో చట్నీ లొల్లి.. బండ్ల గణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య
X

చిన్న విషయాలకు మరీ అంతలా రియాక్టు కావాలా? అన్నట్లుగా మారింది ఈ ఉదంతం గురించి తెలిసినంతనే. హైదరాబాద్ మహానగరంలో తాజాగా చోటు చేసుకున్న ఒక ఆత్మహత్య షాకిచ్చేలా మారింది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి భార్య సూసైడ్ చేసుకున్న వైనం ఒక పట్టాన జీర్ణించుకోలేనిదిగా మారింది. చాలా చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకోవటం చూసినప్పుడు.. దీనికి ప్రాణాలు తీసుకోవాలా? అన్న సందేహం కలుగక మానదు.

భర్తతో చట్నీతో జరిగిన గొడవతో నిర్మాత బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్ గా పని చేసే రమణ సతీమణి.. సోమవారం ఆత్మహత్య చేసుుకున్న వైనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షాకిచ్చేలా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. కొత్తగూడెం జిల్లాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లాకు చెందిన 25 ఏళ్ల చందనను రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్ గా రమణ పని చేస్తుండగా.. అతని సతీమణి చందన.. ఒక జ్యూయలరీ షాపులో పని చేస్తోంది.

వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లోని ఇందిరానగర్ అపార్టుమెంట్ లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవైంది. భోజనంలో చట్నీ ఎక్కువ వేశావంటూ భార్య చందనతో భర్త గొడవ పడ్డాడు. దీంతో.. చందన తీవ్ర మనస్తపానికి గురైంది. సోమవారం ఉదయం అతను విధుల నిమిత్తం పనికి వెళ్లగా.. చందన పలుమార్లు అతనికి వీడియోకాల్స్ చేసింది. అందుకు రమణ స్పందించకపోవటంతో ఫోన్ చేసి.. కావాలనే తనతో గొడవ పడుతున్నట్లుగా పెద్దగా కేకలు వేసింది.

ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. తాను చనిపోతున్నట్లుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో.. అనుమానం వచ్చిన రమణ.. ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి వెళ్లాలని కోరాడు. ఇంటి పక్కన వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించగా.. అప్పటికే ఉరి వేసుకున్న ఆమె చనిపోయి ఉంది. దీంతో.. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిన్న విషయాలకు సూసైడ్ వరకు వెళ్లే వైనం ఇప్పుడు జీర్ణించుకోలేనిదిగా మారింది.