Begin typing your search above and press return to search.

వెంకన్నకు మొక్కు, చంద్రన్నకు ప్రసాదం... బాబుని కలిసి బండ్ల గణేష్!

అవును... ఏపీ సీఎం చంద్రబాబు కోసం మొక్కుకున్న మొక్కు గురించి షాద్ నగర్ టు తిరుమల పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేష్.. మంగళవారం తిరుమలకు చేరుకున్నారు.

By:  Raja Ch   |   12 Feb 2026 10:31 PM IST
వెంకన్నకు మొక్కు, చంద్రన్నకు ప్రసాదం... బాబుని కలిసి బండ్ల గణేష్!
X

సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమల పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడం కోసం ఈ నెల 19న ఉదయం 9 గంటలకు షాద్ నగర్ లోని తన నివాసం నుంచి "సంకల్ప యాత్ర" ప్రారంభించిన ఆయన... మంగళవారం తిరుమలకు చేరుకుని, బుధవారం స్వామివారిని దర్శించుకుని, గురువారం తన అభిమాన నాయకుడిని కలుసుకున్నారు.

అవును... ఏపీ సీఎం చంద్రబాబు కోసం మొక్కుకున్న మొక్కు గురించి షాద్ నగర్ టు తిరుమల పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేష్.. మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. బుధవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన... తెలంగాణ లోని షాద్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సంకల్ప యాత్ర ప్రారంభించి నట్లు తెలిపారు.

ఈ క్రమంలో... 23 రోజుల పాటు 537 కిలోమీటర్లు నిరంతరాయంగా నడిచి శ్రీవారి సన్నిధికి చేరుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం కవాలన్న తన మొరను ఆలకించిన స్వామికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఇది తన జన్మలో గొప్ప ఘట్టమని.. ఈ జన్మంతా శ్రీవారికి సేవలు చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుసుకున్నారు బండ్ల గణేష్.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. చంద్రబాబుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... తన సంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసి, ఎంతో అభిమానించే తన నాయకుడిని కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ కేసులతో అన్యాయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు మళ్లీ నిర్దోషిగా మన మధ్యకు రావాలని స్వామిని మొక్కున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో... ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలూ తొలగిపోవడంతో.. వెంకన్నకు మొక్కు తీర్చుకుని చంద్రన్నకు స్వామివారి ప్రసాదం అందజేసినట్లు వెల్లడించారు. కాగా.. నాడు చంద్రబాబుని అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సమయంలో హైదరాబాద్ వేదికగా బండ్ల గణేష్ తన వాయిస్ ని బలంగా వినిపించిన సంగతి తెలిసిందే!