Begin typing your search above and press return to search.

కల్వకుంట్ల అజయ్ రావు... కేటీఆర్ పేరు మార్పంటూ సంజయ్ కీలక వ్యాఖ్యలు!!

అవును... కేసీఆర్ – కేటీఆర్ ల పేరెత్తితే అంతెత్తున లేచే తెలంగాణ నేతల్లో ఒకరైన బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 10:20 AM GMT
కల్వకుంట్ల అజయ్  రావు... కేటీఆర్ పేరు మార్పంటూ సంజయ్  కీలక వ్యాఖ్యలు!!
X

ప్రస్తుతం తెలంగాణలో నీటి మంటలు తీవ్రస్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆరెస్స్ ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ మధ్యలో బీజేపీ ఎంటరయ్యింది. ఈ సందర్భంగా కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు బండి సంజయ్. ఇదే క్రమంలో కేసీఆర్ గతం గురించి తాను చెబుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కేసీఆర్ – కేటీఆర్ ల పేరెత్తితే అంతెత్తున లేచే తెలంగాణ నేతల్లో ఒకరైన బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అజయ్ రావు, పాస్ పోర్ట్స్ శేఖర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తన కుమారుడు వేసుకునే షర్ట్స్ పై కూడా బీఆరెస్స్ నేతలు విమర్శలు చేస్తున్నారంటూ ఫైరయిన సంజయ్... నలిగిన చొక్కా, అరిగిన రబ్బరు చెప్పుల నుంచి కేసీఆర్ చరిత్ర తీస్తానంటూ విరుచుకుపడ్డారు.

ఇందులో భాగంగా... ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో అజయ్ రావు గా ఉన్న తన కుమారుడు పేరును తారక రామరావుగా మార్చి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి టిక్కెట్ తెచ్చుకున్న చరిత్ర కేసీఆర్ సొంతమని మొదలుపెట్టిన బండి సంజయ్... తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో... కేసీఆర్, కేటీఆర్ లు ఎంత దారుణంగా మాట్లాడతారు అనే విషయాలు సిరిసిల్ల ప్రజలు గ్రహించాలని కోరారు!!

ఇక కరోనా కష్టకాలంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉంటే... తాను మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని ప్రతీ ఆసుపత్రినీ సందర్శించానని, కోవిడ్ పేషెంట్లను కలిశానని సంజయ్ తెలిపారు. ఇక కేసీఆర్.. తెలంగాణలోని సర్పంచులను ఇబ్బందు పెట్టడం వల్లే వారు ఈ రోజు కూలీలుగా మారారని, అప్పులపాలు అయ్యారని ఫైరయ్యారు. గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల సర్పంచులు పెట్రోల్ బంకులలో పని చేశారని దుబ్బయట్టారు.

ఇక కేసీఆర్ పుట్టుపూర్వోత్తరాలన్నీ తాను లెక్కలు తీస్తున్నట్లు చెప్పిన సంజయ్... కేటీఆర్ ముడతల షర్ట్ వేసుకుని తిరిగిన ఫోటోలు బయటపెట్టాలని అని ప్రశ్నించారు. ఇదే సమయంలో... కేసీఆర్ కారును డబ్బులు కట్టలేదని బ్యాంకు వాళ్లు ఎత్తుకుపోయారని సంజయ్ సంచలన ఆరోపణలు చేఆరు. ఇక కేటీఆర్ పాస్ పోర్ట్స్ మీడియేటర్ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాంటి వారంతా తన కుమారుడు బండి కొనుక్కున్నా, కాస్ట్లీ చొక్కా తొడుక్కున్నా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చరిత్ర, కేసీఆర్ చరిత్ర మొత్తం సిరిసిల్ల చౌరాస్తాలో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అందుకు తండ్రీకొడుకులిద్దరూ రెడీనా అని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు!!