పాక్ కి మూడిందా...అందుకేనా ?
భారతదేశంలో తమకు రక్షణ లేదని ఒక వర్గం ప్రజలు మత ప్రాతిపదికన విడిపోతే పాకిస్తాన్ ఏర్పాటు అయింది.
By: Tupaki Desk | 24 April 2025 5:00 AM ISTభారతదేశంలో తమకు రక్షణ లేదని ఒక వర్గం ప్రజలు మత ప్రాతిపదికన విడిపోతే పాకిస్తాన్ ఏర్పాటు అయింది. అలా ఏర్పడిన పాకిస్థాన్ ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు సరికదా ఆకలి, అవినీతి అక్రమాలతో సతమతమవుతోంది. ఇక పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయింది. అదే విధంగా బెలూచిస్తాన్ కూడా విడిపోవాలని బలంగా కోరుకుంటోంది.
ఇక బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలని కోరికతో ఉంది. ఇది పాకిస్తాన్‌లో ఒక ప్రావిన్స్ గా ఉంది. స్వతంత్రత కోసం పోరాడుతోంది. చారిత్రకంగా చూస్తే కనుక బలూచిస్తాన్ ప్రాంతంలోని గణనీయమైన భాగం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా విస్తరించి ఉంది. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలు ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. అలాగే ఉద్రిక్తతలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్నది బలూచిస్తాన్ కోరిక ఉంది.
గతంలో తూర్పు పాకిస్థాన్ ని పాక్ నుంచి వేరు చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేయడంలో భారత్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇపుడు బలూచిస్తాన్ కూడా భారత్ జోక్యం కోరుతూ వస్తోంది. అయితే భారత్ మాత్రం ఇప్పటిదాకా ఆ విషయం పట్టించుకోలేదు.
మరో వైపు చూస్తే పాకిస్తాన్ మీద యుద్ధమే చేస్తూ బలూచిస్తాన్ తన ఉద్యమ కోరికను అలా నిలబెట్టుకుంటోంది. ఇది పాకిస్తాన్ కి చికాకుగానే ఉంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ కి కనుక భారత్ మద్దతుగా ఉంటే పాక్ మరింతగా బలహీనం అవుతుంది బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ ఆ ప్రావిన్స్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.
భారత్ ఇపుడున్న నేపథ్యంలో కనుక తన రాజనీతిని వాడితే కనుక పాక్ చిక్కి శల్యం అవడమే కాదు ముక్క చెక్కలు అవుతుంది అని అంటున్నారు. మరో వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకునే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. దాంతో పూర్తి స్థాయిలో పాక్ ఆట కట్టు అవుతుందని కూడా భావిస్తున్నారు.
ఈ రోజున ప్రపంచం అంతా భారత్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నారు. దాంతో పాక్ ఏ విధంగానూ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. దాంతో ఇదే అదనుగా భారత్ కనుక తన పదునైన వ్యూహాలను అమలులోకి తెస్తే పాకిస్థాన్ ముక్క చెక్కలు కావడం ఖాయమని అంటున్నారు. భారత్ నుంచి విడిపోయినపుడు బంగ్లాదేశ్ సహా అన్నింటినీ తనతో ఉంచుకున్న పాక్ ఇపుడు బాగా తగ్గిపోతోంది. దాంతో పాక్ కి సరైన సమయంలో దెబ్బ తీస్తే ఇక భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూసే అవ్కాశం అసలు ఉండదని అంటున్నారు. భారత్ పాకిస్థాన్ కి శాశ్వతంగా బుద్ధి చెప్పేందుకే చూస్తోంది అని అంటున్నారు.
అంతే కాదు అంతర్జాతీయ సమాజం ఇచ్చిన మద్దతుని సక్రమంగా వాడుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకే భారత్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయాలే తీసుకుంటుంది అని అంటున్నారు. ఈ దెబ్బతో పాక్ కి మూడుతుది అని అంటున్నారు. భారత్ తో ఎందుకు పెట్టుకున్నామా అని పాక్ విలపించినా ఫలితం ఉండదని అంటున్నారు.
