Begin typing your search above and press return to search.

పాక్ సైన్యాన్ని గాల్లోకి ఎగరేసిన బలూచీ ఆర్మీ!

పాకిస్థాన్ కు గత కొంతకాలంగా పక్కలో బల్లెంలా బలూచీ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2025 10:07 AM IST
పాక్ సైన్యాన్ని గాల్లోకి ఎగరేసిన బలూచీ ఆర్మీ!
X

పాకిస్థాన్ కు గత కొంతకాలంగా పక్కలో బల్లెంలా బలూచీ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మారిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ ను బీఎల్ఏ కూడా సెలబ్రేట్ చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియోలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ సైన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది బలూచీ లిబరేషన్ ఆర్మీ.

అవును... పాకిస్థాన్ కు ఊహించని షాక్ తగిలింది. తమ ప్రావిన్స్ లోకి ఎంటరైన పదుల సంఖ్యలో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చేసింది బీఎల్ఏ. దీంతో.. పాక్ ఆర్మీ వెహికల్స్ ఒక్కసారిగా సినిమా స్టైల్లో గాల్లోకి లేచి పడిన పరిస్థితి! తాము ప్రత్యేక దేశంగా ఏర్పడటానికి సహకరించాలే తప్ప.. ఇలా తమ ప్రావిన్స్ లోకి ఎంటరైతే ఫలితం ఇలాగే ఉంటుందని తెలిపింది.

ఓ పక్క భారత్ తో ఉద్రిక్త పరిస్థితుల వేళ.. సరిహద్దుల్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని చెబుతోన్న వేళ.. మరోపక్క పాక్ సైన్యానికి ఊహించని దెబ్బ కొట్టింది బీఎల్ఏ. ఈ దాడిలో సుమారు 30 మంది పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.

కాగా... కొంతకాలంగా పాకిస్థాన్ ఆర్మీ లక్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వీరి దాడుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 250 మంది పాక్ సైనికులు మరణించారని చెబుతున్నారు. మరోపక్క ఖైబర్ ఫాఖ్తూన్ ఖా, సింధ్ ఫ్రావిన్స్ లలో కూడా పాక్ ఆర్మీకి ఎదురుగాలులు వీస్తున్నాయి.