Begin typing your search above and press return to search.

బాల్క సుమన్ చెప్పు మాట వెనుక అసలు లెక్కలు వేరే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు గులాబీ నేతలు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 7:10 AM GMT
బాల్క సుమన్ చెప్పు మాట వెనుక అసలు లెక్కలు వేరే?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు గులాబీ నేతలు. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా పది రోజులు కూడా కాకముందే.. ప్రభుత్వానికి బలం సరిగా లేదని.. పడిపోతుందన్న పుకార్లతో షికారు చేయటం తెలిసిందే. ఆ తర్వాత నుంచి సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలు చేయటం షురూ అయ్యింది. సాధారణంగా ప్రభుత్వం కొత్తగా కొలువు తీరిన తర్వాత మూడు నెలల వరకు విపక్షాలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం సంప్రదాయం. అయితే.. ఆ అలవాటును తుంగలోకి తొక్కేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనకు జతగా హరీశ్ మొదలుకొని మరికొందరు బీఆర్ఎస్ నేతలు సీఎంపై అనుచిత వ్యాఖ్యల వార్ ను షురూ చేశారు.

ఇంతమంది తనను అంటున్న వేళ.. తాను మాత్రం తక్కువ తినలేదన్న విషయాన్ని మాటలతో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. అయితే.. రాజకీయ ప్రత్యర్థులు తన మీద విరుచుకుపడిన సందర్భంలో తప్పించి.. మిగిలిన సందర్భంలో మామూలుగా ఉంటున్నారు.ఈ కారణంగానే రేవంత్ పరుష వ్యాఖ్యలు తరచూ రిపోర్టు కావట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదివారం రేవంత్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు కొని కేటీఆర్.. హరీశ్ రావులపై విరుచుకుపడ్డారు.

దీనికి కౌంటర్ అన్నట్లుగా గులాబీ నేతలు కొందరు తమకు తోచిన రీతిలో రియాక్టు కావటం షురూ చేశారు. ఇలాంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు బాల్క సుమన్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి నాయుడిగా సుపరిచితమైన ఆయన 2014లో నాటి టీఆర్ఎస్ ఎంపీగా గెలిచి సంచలనంగా మారారు. తర్వాతి కాలంలో పెద్దాయనకు.. చిన్నాయకు ఇద్దరికి (కేసీఆర్, కేటీఆర్) సన్నిహితంగా ఉండటం తెలిసిందే.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సుమన్.. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి వీలుగా సీఎం రేవంత్ పై నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ ను అనకూడని మాటలు అన్నంతనే సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ అదే పనిగా కనిపించటం.. అందరూ తన మాట్లాడేలా చేసుకోవాలన్న ప్లాన్ బాగా వర్కువుట్ అయ్యిందని చెప్పాలి. పార్టీ కోసం ఇంతలా కోట్లాడుతున్న నేతగా సుమన్ గుర్తింపు పొంది.. అందుకు బదులుగా అతను టార్గెట్ చేసిన పెద్దపల్లి టికెట్ సొంతం చేసుకునే అవకాశం ఉందంటున్నారు.