Begin typing your search above and press return to search.

గన్‌ మెన్‌ లను సరెండర్‌ చేసిన బాలినేని... డీజీపీ లేఖ సారాంశం ఇదే!

ఇదే సమయంలో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 6:40 AM GMT
గన్‌  మెన్‌  లను సరెండర్‌  చేసిన బాలినేని... డీజీపీ లేఖ సారాంశం ఇదే!
X

గతకొంతకాలంగా అధికార వైసీపీలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్న నేతల్లో ఒకరు అన్న పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టిన ఆయన... దానికి కొనసాగింపుగా అన్నట్లుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన గన్ మెన్ లను సరెండర్ చేశారు.

అవును... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌ మెన్‌ లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి డీజీపీకి బాలినేని లేఖ రాశారు. ఇదే సమయంలో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని.. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా సరే వదిలిపెట్టవద్దని కోరుతున్న బాలినేని శ్రీనివాస్... పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని.. అందుకు నిరసనగా తక్షణం తన గన్‌ మెన్‌ లను సరెండర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే డీజీపీ లేఖ రాశారు.

ఇదే క్రమంలో... తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని చెబుతున్న బాలినేని... నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కోరిన బాలినేని శ్రీనివాసరెడ్డి... ఈ కేసులో తన పక్కనున్న వారినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని కోరారు.

కాగా... ఒంగోలులో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఎన్నారైలు, ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులు, భూములకు సంబంధించి నకిలీ దస్తావేజులు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే వార్త స్థానికంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మంది అరెస్టు అయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని శ్రీనివాస రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇందులో భాగంగా... పోలీసుల తీరుకు నిరసనగా తాజాగా తన గన్‌ మెన్‌ లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు.