Begin typing your search above and press return to search.

మాగుంట రాజీనామా వేళ... బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇదే సమయంలో మాగుంట కోసం తాను ముఖ్యమంత్రి వద్ద చాలా పట్టుబట్టినట్లు తెలిపిన బాలినేని.. అది సాధ్యం కాలేదని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 11:54 AM GMT
మాగుంట రాజీనామా వేళ... బాలినేని ఆసక్తికర  వ్యాఖ్యలు!
X

అధికార వైసీపీలో ముక్కుసూటిగా మాట్లాడే నేతల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు! తాను చెప్పాలనుకున్న విషయాన్ని, తన సంతోషాన్ని, తన బాధను.. అన్నింటినీ పబ్లిక్ గా ఎక్స్ ప్రెస్ చేస్తారనే పేరు ఆయనకు ఉందని అంటుంటారు! ఈ సమయంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా అనంతరం ఆయన మైకందుకోవడంతో వీటిపై మరింత ఆసక్తి నెలకొంది!

అవును... మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన విషయాలు చేశారు. ఇందులో భాగంగా... జరుగుతున్న పరిణామాలన్నీ తాను సీఎం జగన్ కు చెబుతానని చెప్పిన ఆయన... జరుగుతున్న అన్ని విషయాలు ఆయనకు తెలియాల్సిందే అని అన్నారు. ఈ క్రమంలో తాను సీఎం ని ఎప్పుడు కలిసినా అలిగినట్లు అంటారని.. తాను ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికే ప్రయత్నిస్తానని అన్నారు. అలా అడిగిన వాటిలో పేదళకు ఇళ్లపట్టాలు ఒకటని తెలిపారు.

ఇక ఉద్యోగుల సమస్యల విషయాలను ప్రస్థావించిన బాలినేని... రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు అన్నీ సీఎం జగన్ పరిష్కరిస్తారని వెల్లడించారు. ఇదే సమయంలో మాగుంట కోసం తాను ముఖ్యమంత్రి వద్ద చాలా పట్టుబట్టినట్లు తెలిపిన బాలినేని.. అది సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఆయన వెళ్లారు కదా అని ఆయనతో పాటు తాను వెళ్లలేను కదా అని స్పష్టం చేశారు.

ఇక తాజాగా మాగుంటతో కలిపి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన... మాగుంటతో కలిసి పక్కపక్కనే కూర్చుని కార్యక్రమంలో పాల్గొన్నా.. రేపు కొంతమంది దీన్ని చిలువలు పలువలు చేసి రాస్తారని.. ఆయన వైసీపీకి రాజీనామా చేసినా కూడా కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారంటూ మాట్లాడతారని తెలిపారు. ఈ క్రమంలో... తనకు చిత్తశుద్ధి ఉందని, ఆ మేరకే తాను రాజకీయాలు చేస్తానని బాలినేని అన్నారు.

ఇదే క్రమంలో... రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా.. దాన్ని దిద్దుకోవడానికి ఏళ్లు పడుతుందంటూ... వైఎస్సార్ చెప్పిన మాటలు తనకు గుర్తున్నాయని ఈ సందర్భంగా బాలినేని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే... పార్టీలో ఉండి ఆ పార్టీకి ద్రోహం చేయకుండదని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని వైఎస్సార్ చెప్పిన మాటలే తనకు స్పూర్తి అని తెలిపారు. ఇదే క్రమంలో... ఈ ఎన్నికల్లోనే తన చివరి పోటీ అని, ఈ సందర్భంగా ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు!

రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా సరిదిద్దుకోవటానికి ఏళ్లు పడుతుంది అని వైఎస్సార్ చెప్పిన మాటలు తనకు గుర్తున్నాయన్నారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదు.. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని ఆయన చెప్పిన మాటలే స్పూర్తి అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.