Begin typing your search above and press return to search.

పెద్దిపై బాలయ్య ఫోకస్.. రీజన్ ఏంటి?

అంతేకాదు, ఆడియన్స్ టేస్ట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవడంలో బాలయ్య ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారని కూడా అంటున్నారు.

By:  M Prashanth   |   10 Jun 2026 5:01 PM IST
పెద్దిపై బాలయ్య ఫోకస్.. రీజన్ ఏంటి?
X

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్‌ తో బిజీగా ఉన్న బాలయ్య.. ఇప్పుడు పెద్ది సినిమా గురించి ఆరా తీశారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.

అయితే నేడు బాలయ్య బర్త్ డే కాగా.. పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు అంతా. అందులో భాగంగా వృద్ధి సినిమాస్ బ్యానర్ అధినేత, నిర్మాత వెంకట్ సతీష్ కిలారు కూడా ఆయనను కలిశారు. ఫ్లవర్ బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. అందులో సతీష్ కిలారుతో బాలయ్య కాసేపు మాట్లాడినట్లు కనిపిస్తోంది.

ఈ సందర్భంగా బాలయ్య.. ఇటీవల విడుదలైన పెద్ది సినిమా థియేటర్లలో ఎలా ఆడుతోంది? ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది? కలెక్షన్ల పరిస్థితి ఏంటి? అనే విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సాధారణంగా తన సినిమా పనుల్లోనే కాకుండా, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై కూడా బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఫోకస్ పెడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

అయితే ఈసారి పెద్ది గురించి ప్రత్యేకంగా ఆరా తీయడానికి మరో స్ట్రాంగ్ రీజన్ కూడా కనిపిస్తోంది. పెద్ది మూవీ నిర్మాత వెంకట్ సతీష్ కిలారే ప్రస్తుతం బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో రూపొందుతున్న NBK 111 సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో నిర్మాతను కలిసిన సందర్భంలో ఆయన రీసెంట్ మూవీ రిజల్ట్ గురించి బాలయ్య అడిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు, ఆడియన్స్ టేస్ట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవడంలో బాలయ్య ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారని కూడా అంటున్నారు. ఎలాంటి కథలకు ఆదరణ లభిస్తోంది? మాస్ ఆడియన్స్ ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారు? కుటుంబ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది? వంటి విషయాలను తెలుసుకోవడం వల్ల తన సినిమాల విషయంలో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆయన ఆరా తీసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక NBK 111 విషయానికి వస్తే.. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో వస్తున్న ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ ఫుల్ యాక్షన్‌ తో పాటు ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే కథతో సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా, ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్.

ఏదేమైనా నిర్మాత సతీష్ కిలారు కలసిన సమయంలో బాలయ్య అడిగిన 'పెద్ది ఎలా ఆడుతోంది?' అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. నిర్మాతతో ఉన్న రిలేషన్, పరిశ్రమపై ఉన్న అవగాహన, ప్రేక్షకుల పల్స్ ను తెలుసుకోవాలనే ఆసక్తి.. ఆ మూడు కారణాల్లో ఏది అసలు రీజనో తెలియదు గానీ, పెద్దిపై బాలయ్య ఆసక్తికి కారణం ఏంటో అంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.