Begin typing your search above and press return to search.

సెల్ఫీ అడిగితే ఒక్కటిచ్చాడు... అభిమానిపై చెయ్యి చేసుకున్న బాలకృష్ణ!

అవును... ఏపీలో పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం హీట్‌ పెంచుతుంది.

By:  Tupaki Desk   |   13 April 2024 7:32 AM GMT
సెల్ఫీ అడిగితే ఒక్కటిచ్చాడు... అభిమానిపై  చెయ్యి చేసుకున్న బాలకృష్ణ!
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ లో ప్రచారాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్షాలు ఎవరి స్టైల్లో వారు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో హోరెత్తించేస్తున్నారు నేతలు. ఇందులో భాగంగా తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా అనూహ్యపరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... అభిమానిపై బాలయ్య చెయ్యిచేసుకున్నారు!!

అవును... ఏపీలో పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం హీట్‌ పెంచుతుంది. ఈ సందర్భంగా పార్టీల అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలకు తెరలేపుతున్న నేపథ్యంలో... అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేశారు. ఈ సమయంలో... సీమసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధం అయ్యారు.

ఈ సందర్భంగా... కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన... ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అయితే... ఎన్నికల ప్రచారానికంటే ముందే తన శైలిలో ఫ్యాన్స్ పై దూకుడు షురూ చేసేశారు బాలయ్య. ఇందులో భాగంగా... శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి, చేయి కూడా చేసుకున్నారు! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది!

ఇందులో భాగంగా... బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు. ఈ సందర్భంగా... జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సమయంలో ఒక అభిమానికి బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ చేయి చేసుకున్నారు! దీంతో... బాలయ్య ఈ ప్రచార కార్యక్రమాల్లో ఇంకెంతమందిపై దబిడి దిబిడి అంటారో అనే చర్చ నెట్టింట మొదలైంది.

ఇక.. నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ "స్వర్ణాంధ్ర సాకార యాత్ర" పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. దీని కోసం ఓ ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. కాగా... ఇప్పటికే పలు సందర్భాల్లో బాలయ్య తన ఫ్యాన్స్‌ పై చేసుకున్న సంగతి తెలిసిందే.