Begin typing your search above and press return to search.

బాలయ్య లైఫ్ లో హిస్టారికల్ డే !

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ జీవితంలో చారిత్రాత్మక దినంగా ఈ నెల 28 సోమవారాన్ని చూడాలి.

By:  Tupaki Desk   |   28 April 2025 9:45 AM IST
బాలయ్య లైఫ్ లో హిస్టారికల్ డే !
X

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ జీవితంలో చారిత్రాత్మక దినంగా ఈ నెల 28 సోమవారాన్ని చూడాలి. ఆ రోజున బాలయ్య కేంద్ర ప్రభుత్వం జనవరిలో ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారాలలో మూడవది అయిన పద్మ భూషణ్ ని అందుకోబోతున్నారు. రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకుంటారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 26న బాలయ్యకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య నటుడిగా యాభై ఏళ్ళ వేడుకను గత ఏడాది ఆగస్టు 30తో పూర్తి చేసుకున్నారు. రాజకీయ రంగంలో సైతం మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఆయన రాణిస్తున్నారు.

సామాజిక సేవా రంగాలలో బాలయ్య తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాలయ్య అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవి. ఈ విధంగా చూస్తే ఆరున్నర పదుల బాలయ్య జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. ఎందరికో స్పూర్తిదాయకంగా ఆయన మారారు.

యువతరం ఆయన కష్టాన్ని చూసి తాము అలాగే చేయాలన్న ఆకాంక్షను ఆయన కలిగిస్తున్నారు ఇక బాలయ్యకు ఈ విశిష్టమైన గౌరవం దక్కుతున్న వేళ నందమూరి నారా కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొంటాయని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇక బాలయ్య అల్లుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కుమార్తె బ్రాహ్మిణి ఇద్దరూ ఈ వేడుకలో పాల్గొంటారు అని చెబుతున్నారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలలో పాల్గొంటారా లేదా అన్న చర్చ సాగుతోంది ఆయన తన బాబాయ్ కి ఈ విశిష్ట గౌరవం దక్కుతున్న వేళ అబ్బాయి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు. మరో వైపు బాలయ్య పద్మ భూషణ్ అవార్డుని అందుకుంటున్న సందర్భంలో అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.