Begin typing your search above and press return to search.

బ‌ద్వేల్ వైసీపీ ఈక్వేష‌న్లు మారుతున్నాయా.. ?

కేవ‌లం సొంత‌గానే సుధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఎంపీ వ‌ర్గం నుంచి కూడా ఆమెకు ఎలాంటి స‌మాచారం లేద‌ని తెలుస్తోంది.

By:  Garuda Media   |   18 Feb 2026 7:00 PM IST
బ‌ద్వేల్ వైసీపీ ఈక్వేష‌న్లు మారుతున్నాయా.. ?
X

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయా? ప్ర‌స్తుత ఎమ్మె ల్యే దాస‌రి సుధ‌కు వ్య‌తిరేక వ‌ర్గం పెరిగిపోయిందా? అంటే.. ఔన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద టి వ‌ర‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి వ‌ర్గంలో ఉన్న సుధ‌ను త‌ర్వాత త‌ర్వాత‌.. అవినాష్ వ‌ర్గం ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే సుధ‌కు కాకుండా.. త‌న వ‌ర్గంలోని కీల‌క నేత‌కు టికెట్ ఇవ్వాల‌ని ఎంపీ అవినాష్ కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. జ‌గ‌న్ ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టి సుధ‌కే అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో సు ధ‌ను అవినాష్ వ‌ర్గ‌మే ప‌క్క‌న పెడుతోంది. ఆమె జ‌న‌సేన‌లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వాద‌న‌ను కూడా తెర‌మీదికి తెచ్చింది.. ఈ వ‌ర్గమేన‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అయితే.. అప్ప‌ట్లో ఆమె ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చారు. ఉద్దేశ పూర్వకంగానే త‌న‌పై ఈ ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా చెప్పారు. దీంతో ఈ వ్య‌వహారం స‌ర్దు మ‌ణిగినా.. ఎంపీ వ‌ర్గం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు ఎమ్మెల్యే హాజ‌రు కావ‌డం లేదు.

కేవ‌లం సొంత‌గానే సుధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఎంపీ వ‌ర్గం నుంచి కూడా ఆమెకు ఎలాంటి స‌మాచారం లేద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల చేప‌ట్టిన పీపీపీకి వ్య‌తిరేక నిర‌స‌న, అనంత‌రం చేప‌ట్టిన ల‌డ్డూ నిర‌స‌న‌ల్లోనూ ఎంపీ వ‌ర్గం ఆమెను ప‌క్క‌న పెట్టింది. ఇక‌, క‌డ‌ప ఎంపీ ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ డంతోపాటు.. అవినాష్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జిల్లాలోని రాజ‌కీయాలు కూడా న‌డుస్తున్నాయి. దీంతో బ‌ద్వేల్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారికి అవ‌కాశం ఇప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ కూడా జోక్యం చేసుకోవ‌డం లేద‌ని సుధ వ‌ర్గంగా ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. సో.. దీనిని బ‌ట్టి బ‌ద్వేల్‌లో వైసీపీ ఈక్వేష‌న్లు మారే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల నిధులు కూడా గ‌తంలో అవినాష్ రెడ్డే స‌మ‌కూర్చిన నేప‌థ్యంలో ఆయ‌న మాట‌కే ఇప్పుడు వైసీపీ అధినేత ప్రాధాన్యం ఇస్తార‌ని అంటున్నారు.