Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే జగన్ కి షాక్ ఇస్తారా ?

వైసీపీకి ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు. అందులో అధినేతను తీస్తే మిగిలిన వారు పది మంది.

By:  Tupaki Desk   |   30 April 2025 3:48 AM
Badvel MLA Dasari Sudha: Is She Planning to Leave YSRCP
X

వైసీపీకి ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు. అందులో అధినేతను తీస్తే మిగిలిన వారు పది మంది. ఇందులో కూడా కొత్త వారు అయిదారుగురు ఉన్నారు. మిగిలిన వారు అంతా వైసీపీకి కట్టుబడి ఉన్నవారే. ఇక వీరిలో కూడా కొందరు పార్టీ మారుతారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది.

అయితే అది ఒట్టి ప్రచారమా నిజంగా అలా జరుగుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఒక మహిళా ఎమ్మెల్యే ఫిరాయిస్తారు అని పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె ఎవరో కాదు బద్వేలు నియోజకవర్గానికి చెందిన దాసరి సుధ.

ఆమె 2021 అక్టోబరు 30లో జరిగిన ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త మరణంతో ఖాళీ అయిన సీటు నుంచి ఆమె పోటీ చేసి విజేత అయ్యారు. ఇక 2024లో మరోసారి పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ఆమె మళ్ళీ గెలిచి వచ్చారు.

అయితే ఆమె ఇటీవల కాలంలో పార్టీ పట్ల అంతగా ఉత్సాహంగా లేరని అంటున్నారు పైగా అధినాయకత్వం ఆమె విషయంలో నిర్లక్ష్యంగా ఉందని అంటున్నారు. ఆమె అధినేతను కలవాలన్నా అపాయింట్మెంట్లు దొరకడమే కష్టంగా ఉందని చెబుతునారు ఈ పరిస్థితులో నేపథ్యంలో పార్టీలో ఉండాలా వద్దా అన్న చర్చ ఆమె సన్నిహితుల నుంచి వస్తోంది అని అంటున్నారు.

ఇక ఆమె కూటమి పార్టీలకు టచ్ లో వెళ్ళారని అంటున్నారు. ఆమె జనసేనలో చేరవచ్చు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఆమె కనుక పార్టీలో వస్తే సముచితమైన స్థానాన్ని కలిగిస్తామని కూడా చెబుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే 164 సీట్లు కలిగి ఉన్న టీడీపీ కూటమికి అనవసరంగా ఈ ఫిరాయింపుల తలనొప్పి ఎందుకు అన్న చర్చ సాగుతోంది. పైగా వారిని తీసుకుని వచ్చినా వైసీపీకి ప్రత్యేకంగా సానుభూతిని తీసుకుని రావడం తప్ప జరిగేది ఏమీ ఉండదని అంటున్నారు.

ఇక చూస్తే బద్వేల్ ఎమ్మెల్యే సుధ వైసీపీకి వీర విధేయురాలు అని ఆమె ఫిరాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అన్నీ కూడా పుకార్లు మాత్రమే అని అంటున్నారు. ఆమె ఎట్టి పరిస్థితులలో పార్టీ మారేది ఉండదని కూడా అంటున్నారు.

ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఎందుకు ఈ పుకార్లు వస్తున్నాయంటే జగన్ సొంత జిల్లాలో ఆయనను నైతికంగా దెబ్బ తీసేందుకే అని వైసీపీ వారు అంటున్నారు. మరి ఏది పుకారో ఏది నిజమో రాజకీయాల్లో తేల్చడం కష్టం. అందువల్ల ఆమె పార్టీ మారుతున్నారా లేదా అన్నది ఈ రోజుకి పుకారుగా ఉన్నా ఏమి జరుగుతుందో తెలియదు అన్న మాట కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.