Begin typing your search above and press return to search.

జగన్ సర్వేలకు సై అంటున్న బాబు... వారికి బ్యాడ్ న్యూస్!

అలాంటప్పుడు వైసీపీ నుంచి తెచ్చుకుని వారిని సర్ధుబాటు చేయడం ఇప్పుడున్న సమయంలో అత్యంత బ్యాడ్ ఆప్షన్ అని బాబు & కో భావిస్తున్నారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 8:00 AM GMT
జగన్  సర్వేలకు సై అంటున్న బాబు... వారికి బ్యాడ్  న్యూస్!
X

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... టిక్కెట్ల కోసం పోటీపడే ఆశావహుల సంఖ్య ఒక్కో నియోజకవర్గంలోనూ కనీసం రెండు నుంచి 3 వరకూ ఉంటుందని అంటుంటారు. ఈ విషయంలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తుంటారని చెబుతుంటారు. పైగా అధికార వైసీపీ ఇప్పుడు ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మరుస్తున్న నేపథ్యంలో... అసంతృప్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. ఈ సమయంలో వారికి ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది!

అవును... సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణలను ప్రాతిపదికగా తీసుకుంటున్న జగన్... పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నేతలు జగన్ నిర్ణయం ఏదైనా తమకు శిరోధార్యమే అంటుంటే.. కొంతమంది మాత్రం పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా వ్యక్తుల కంటే పార్టీ గెలుపే ముఖ్యమని.. అసలు జుట్టంటూ ఉంటే కదా ఎన్ని రకాల కొప్పులైనా పెట్టుకోవచ్చని భావిస్తున్న పలువురు నేతలు టిక్కెట్లు దక్కకపోయినా జగన్ తోనే తమ ప్రయాణం అంటూ కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని అంటుండగా... మరికొంతమంది మాత్రం పక్క చూపులు చూస్తూ, హైదరాబాద్ లో మకాం పెట్టి బాబు అపాయింట్ మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో వైసీపీ నుంచి గోడదూకి వచ్చే అభ్యర్థుల విషయంలో చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఉన్న స్థానాల్లో జనసేనకు కేటాయించిన స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించడమే తడిసి మోపెడవుతుందని చెబుతున్నారు! అలాంటప్పుడు వైసీపీ నుంచి తెచ్చుకుని వారిని సర్ధుబాటు చేయడం ఇప్పుడున్న సమయంలో అత్యంత బ్యాడ్ ఆప్షన్ అని బాబు & కో భావిస్తున్నారని చెబుతున్నారు.

పైగా... జగన్ చేయించుకున్న సర్వేల ఫలితాలపై చంద్రబాబు కూడా నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు! ఇందులో భాగంగా... వీరికి గెలిచే అవకాశం ఉంటే జగనే టిక్కెట్ ఇచ్చేవాడు కదా.. అక్కడ టిక్కెట్ దొరకలేదని ఇక్కడకు వచ్చేవారు పార్టీకి అదనపు భారమే తప్ప అదనపు ప్రయోజనం కాదనే ఆలోచన కూడా చంద్రబాబు & కో చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో జగన్ సర్వేలకు చంద్రబాబు కూడా విలువ ఇస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా గోడదూకి వచ్చేవారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే ఆలోచనను చంద్రబాబు ప్రస్తుతానికి పక్కనపెట్టారని... టిక్కెట్ లేకపోయినా కూడా పార్టీలో పనిచేస్తామంటేనే కండువా కప్పాలి తప్ప.. టిక్కెట్ విషయంలో భరోసా మాత్రం ఇవ్వలేమని చెబుతున్నారని అంటున్నారు. మరి బాబు నిర్ణయం ఇలా ఉన్న నేపథ్యంలో... వైసీపీ అసంతృప్తులు ఫ్యాన్ కిందే సేదతీరుతారా.. లేక మరో ఆలోచన చేస్తారా అనేది వేచి చూడాలి!