Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో బాబు టూర్.. విశాఖ రాజధాని నినాదం !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రాలో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

By:  Tupaki Desk   |   15 April 2024 4:27 AM GMT
ఉత్తరాంధ్రాలో బాబు టూర్.. విశాఖ రాజధాని నినాదం !
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రాలో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు విశాఖలో విజయనగరంలో శ్రీకాకుళంలో ఇలా ప్రతీ జిల్లాలో రెండు మూడు సభలు వంతున ఆయన ప్రసంగాలు చేపడుతున్నారు.

విజయనగరంతో పాటు ఎలమంచిలి సభలలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జత కలవనున్నారు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో మరోసారి . విశాఖ రాజధాని నినాదానికి వైసీపీ తెర లేపింది. బాబు శ్రీకాకుళం వస్తున్న క్రమంలో ఆయన చంద్రబాబు వెనకబడిన ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు అని ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లా అంతా టీడీపీకి ఓట్లు సీట్లూ ఇస్తే ఒక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా వైసీపీ హయాంలోనే జిల్లాలో జరిగింది అని ఆయన చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా బాగుపడుతుందని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్రా వెనకబాటుతనం పోవడానికే విశాఖను రాజధానిగా చేయాలని వైసీపీ నిర్ణయించిందని ఆయన అన్నారు. వైసీపీ గెలిస్తే విశాఖ రాజధాని అవడం ఖాయమని అన్నారు. టీడీపీ ఏలుబడిలో ఉత్తరాంధ్రాను అసలు పట్టించుకోలేదని అయన విమర్శించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు రెండు రోజుల క్రితమే అమరావతి మన రాజధాని అంటూ నినాదం చేశారు. ఆయన గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ అమరావతిని తాను అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని గా తీర్చిదిద్దుతామని అన్నారు

దాంతో బాబు ఉత్తరాంధ్రా టూర్ లో సీనియర్ మంత్రి ధర్మాన విశాఖ రాజధాని నినాదాన్ని వినిపించారు. మరి బాబు విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామని అంటున్నారు. అది కాదు పూర్తి రాజధాని గా వైసీపీ చేస్తుందని అసలైన అభివృద్ధి ఏమిటో చూపిస్తుందని ధర్మాన అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు విశాఖ రాజధాని మీద ఏమైనా చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.