సైకిల్ కి రిపేర్లు చేయనున్న బాబు...?
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నారు. మధ్యలో విలువైన కాలం కాస్తా జైలు పాలు బెయిల్ పాలు అయింది.
By: Tupaki Desk | 21 Nov 2023 2:30 AMతెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నారు. మధ్యలో విలువైన కాలం కాస్తా జైలు పాలు బెయిల్ పాలు అయింది. దాంతో రానున్న సమయం అంతా జోరు మీద ఉండాలని చంద్రబాబు డిసైడ్ అవుతున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీలో రిపేర్లకు బాబు ముందు సిద్ధం అవుతారని అంటున్నారు. తాను జైలులో ఉండగా తన పరోక్షంగా పార్టీ పనితీరు ఎలా ఉందో చూసి మరీ బేరీజు వేసుకుని చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అని అంతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రెసిడెంట్ మార్పు ఉంటుందని ఒక ప్రచారం అయితే సాగుతోంది. మూడేళ్ళ పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు అనుకున్న స్థాయిలో పార్టీని మెప్పించలేకపోయారు అని అంటున్నారు. అదే విధంగా అచ్చెన్నాయుడు బాబు జైలులో ఉన్న సమయంలో కూడా పార్టీని పరుగులు పెట్టించలేకపోయారు అని అంటున్నారు.
దాంతో అచ్చెన్నాయుడుని తప్పిస్తే కనుక ఆ ప్లేస్ లో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడుకి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా బీసీ నుంచి తీసుకున్న పదవిని బీసీకే ఇవ్వడం ద్వారా పార్టీ పట్టుని అలాగే బీసీలలో ఉంచుకోవాలని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలు ఈసారి చాలా కీలకంగా మారుతున్నాయి.
జనసేనతో పొత్తు ఉండడం వల్ల కాపు ఓట్ల విషయంలో బెంగ లేదని, బీసీల ఓట్లు తమ వైపునకు తిప్పుకునేందుకు సీనియర్ బీసీ నేత అయిన యనమలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది అన్నది బాబు మార్క్ ఆలోచనగా చెబుతున్నారు.
అంతే కాదు ఈ మూడు నెలల కాలంలో పనిచేయని నేతల విషయం కూడా బాబు దృష్టికి వచ్చిందని, వారికి కూడా ఏమి చేయాలో అదే చేస్తారు అని అంటున్నారు. బాబు జైలులో ఉన్న సమయంలో చాలా మంది సీనియర్లతో సహా కీలక నేతలు అంతా మీడియా ప్రకటనలకే పరిమితం అయిపోయారు. అంతే కాదు పార్టీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా ఓవరాల్ గా చతికిలపడిపోయింది.
దాంతో బాబు మార్క్ షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. నిజానికి బాబు జైలు బెయిల్ జీవితం ఎవరూ అసలు ఊహించలేదు అని అంటున్నారు. బాబు సైతం అలా అనుకోలేదు. బాబుకు ఒక విధంగా పార్టీ ఎలా ఉంది అన్నది ఏ సర్వే అవసరం లేకుండా తెలిసి వచ్చింది అని అంటున్నారు. దాంతో టీడీపీకి అతి పెద్ద కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తించారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు సీరియస్ గానే పార్టీ ప్రక్షాళన మీద దృష్టి పెడుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఎన్నికల ముందు చేపట్టే ఈ మార్పు చేర్పులు పార్టీని ఏ విధంగా తీసుకెళ్తాయో.