Begin typing your search above and press return to search.

టికెట్ వద్దు బాబూ అంటే బాబూమోహన్ కి టికెట్...!

బాబూమోహన్ పేరు మొదటి విడతలో లేకపోవడంతో ఈ సీనియర్ పొలిటీషియన్ కం సినీ నటుడు అలిగి నేను పోటీ చేయంటే చేయను అని చెప్పేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 12:11 PM GMT
టికెట్ వద్దు బాబూ అంటే బాబూమోహన్ కి టికెట్...!
X

అదేంటో టికెట్లు కావాలని అందరూ అడుగుతారు. కొందరు టికెట్లు దక్కలేదని అలిగి పార్టీని విడిచిపోతారు. చిత్రంగా బీజేపీలో మాత్రం టికెట్లు ఇస్తామంటే వద్దు బాబూ అంటున్న వారే ఎక్కువగా ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి. సినీ నటుడు బాబూమోహన్ అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు.

తన పేరు కచ్చితంగా తొలి జాబితాలో వస్తుందని కూడా ఆయన భావించారు అని అంటున్నారు. బాబూమోహన్ పేరు మొదటి విడతలో లేకపోవడంతో ఈ సీనియర్ పొలిటీషియన్ కం సినీ నటుడు అలిగి నేను పోటీ చేయంటే చేయను అని చెప్పేశారు. అదీ కూడా రెండు రోజుల క్రితం ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ బీజేపీ హై కమాండ్ మీదనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే మూడవ విడత జాబితాలో బాబూమోహన్ పేరు ఆందోల్ సీటులో ఉంది. ఆయన మరి ఇపుడు ఏమంటారో చూడాలి. తాను పోటీ చేయను అని కచ్చితంగా తేల్చి చెప్పేసిన బాబూమోహన్ కి టికెట్ ఇచ్చి బీజేపీ సర్ప్రైజ్ ఇచ్చిందా లేక బాబూమోహన్ ఇపుడు పార్టీకి షాక్ ఇస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

పోటీ చేయను అని చెప్పేసిన నేతకు టికెట్ అంటే బీజేపీ అధినాయకత్వం అభిప్రాయం ఏమని అనుకోవాలన్నది కూడా చర్చగా ఉంది. ఇక టికెట్ తనకు వద్దు ఈసారి తన సీట్లో బీసీకి టికెట్ ఇవ్వండి తాను ప్రచారం చేస్తాను అని గద్వాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ చెప్పేశారు.

అయితే ఆమె అంతలా చెప్పినా బీజేపీ హై కమాండ్ వింటుందా అన్నది అతి పెద్ద డౌట్. ఎందుకంటే గద్వాల్ టికెట్ ని పెండింగులో పెట్టడమే అంటున్నారు. మరి లాస్ట్ జాబితాలో అరుణ పేరుని ఉంచి రిలీజ్ చేసినా చేస్తారు అని అంటున్నారు. మరి ఆమె కూడా పోటీకి సై అంటారా లేక మొదటి మాటకే కట్టుబడి ఉంటారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కొందరు నేతలు బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డారు. ముషీరాబాద్ టికెట్ ను ఆశించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి మొండి చేయిని బీజేపీ అధినాయకత్వం చూపించింది అని అంటున్నారు. ఇక సికింద్రాబాద్ టికెట్ కోరిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డికి కూడా హ్యాండ్ ఇచ్చారు.

ఈ రెండు సీట్లలో వేరే వారికి టికెట్లు ఇస్తూ బీజేపీ హై కమాండ్ డెసిషన్ తీసుకోవడం చర్చనీయాంశం అయింది. మరి ఈ ఇద్దరు ఆశావహులు ఏమి చేస్తారో చూడాలని అంటున్నారు. ఇక అంబర్ పేట టికెట్ ని మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్ కి కేటాయించారు. ఆయన దాదాపుగా పాతికేళ్ళ తరువాత పోటీ చేస్తున్నారు అని అంటున్నా రు. మొత్తానికి చూస్తే మూడవ విడత జాబితాలో బీజేపీ చాలా మందికి షాకులతో పాటు సర్ప్రైజ్ లను ఇచ్చేసింది అంటున్నారు.