Begin typing your search above and press return to search.

జగన్ వేసే కార్డు చూసి చంద్రబాబు కార్డు వేస్తారట...!

వైసీపీలో అభ్యర్ధుల లిస్ట్ ని చూస్తిన తరువాతనే అన్నీ చూసుకుని టీడీపీ అభ్యర్ధులను ప్రకటించాలని బాబు డిసైడ్ అయినట్లుగా లేటెస్ట్ గా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 1:21 PM GMT
జగన్ వేసే కార్డు చూసి చంద్రబాబు కార్డు వేస్తారట...!
X

పేకాట పరిభాషలో అయితే కార్డు అన్నది అర్ధం అవుతుంది. రాజకీయ భాషలో అయితే వైసీపీ లిస్ట్ చూసిన మీదటనే చంద్రబాబు తన లిస్ట్ ని ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే ముందస్తు లిస్ట్ వంద మంది దాకా అభ్యర్ధులు అంటూ టీడీపీ నుంచి విపరీతమైన ప్రచారం సాగింది. కానీ రాజకీయ వ్యూహకర్త చతురుడు అయిన చంద్రబాబు మరోమారు తన ఎత్తులకు పదును పెడుతున్నారు.

వైసీపీలో అభ్యర్ధుల లిస్ట్ ని చూస్తిన తరువాతనే అన్నీ చూసుకుని టీడీపీ అభ్యర్ధులను ప్రకటించాలని బాబు డిసైడ్ అయినట్లుగా లేటెస్ట్ గా ప్రచారం సాగుతోంది. దానికి కారణం ఏంటి అంటే వైసీపీలో కనీసంగా యాభై మంది దాకా సిట్టింగులకు టికెట్ దక్కదని బయటకు ప్రచారం సాగుతోంది. మరి అంత పెద్ద మొత్తంలో టికెట్లు రాని వారు కనుక ఉంటే వారు వేరే పార్టీ చూసుకుంటారు అని టీడీపీ ఊహిస్తోంది.

అలాంటి వారికి టీడీపీ ఒక ఆల్టర్నేషన్ గా ఉండాలనే బాబు ఈ ఎత్తుగడ వేస్తున్నారు అని అంటున్నారు. అంటే జగన్ టికెట్ ఇవ్వకపోతే నేరుగా టీడీపీ వైపే వారంతా వస్తారని అలా వచ్చిన వారిని వచ్చినట్లే చేరుకుని వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. అని అంటున్నారు. అయితే వారికి టికెట్లు మాత్రం ఇవ్వకుండా వారి పలుకుబడిని ఉపయోగించుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత ప్రాధాన్యత కలిపిస్తామని బాబు అతి పెద్ద అభయం ఇస్తారని అంటున్నారు.

అయితే ఇలాంటి టీడీపీ వ్యూహాలు ముందే ఊహించిన జగన్ కూడా యాభై సీట్లలో కొత్త ముఖాలను తీసుకుని వచ్చినా చాలా రకాలైన కసరత్తులే చేస్తారు అని అంటున్నారు. కొందరికి ఆ సీటు కాకుండా వేరే నియోజకవర్గం ఇస్తారని, అలాగే మరి కొందరికి ఎంపీగా చాన్స్ ఇస్తారని ఇంకోదరిని తనదైన హామీలు ఇస్తారని అంటున్నారు. ఇలా దాదాపుగా అందరూ పార్టీలో ఉండేటట్లుగా జగన్ చూసుకుంటారు అని అంటున్నారు.

ఇక మరీ వినని వారు ఉంటే మాత్రమే టీడీపీ వైపు వెళ్తారని అంటున్నారు. ఒక వేళ వెళ్ళినా అక్కడ అప్పటికే చాలా మంది జనసేనతో పొత్తు వల్ల టికెట్లు దక్కని సీన్ ఉందని, అలాంటి నేపధ్యంలో బాబు పంచన చేరినా టికెట్ దక్కదని, ఒక వేళ బాబు ఇచ్చే భవిష్యత్తు హామీలు అయినా నీటి మూటలే అని అందరికీ తెలుసు అని వైసీపీ వర్గాలు అంటున్నారు.

సో తాము మూడు నెలల ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా చాలా మటుకు సర్దుకునే అవకాశం ఉందని, అదే చివరి నిముషం వరకూ ఆచీ తూచీ లెక్కలేసుకుంటే టీడీపీకే ఇబ్బంది అని అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా బాబు మాత్రం వైసీపీ నుంచి పుట్టే అసంతృప్తి మీదనే ఆధారపడుతున్నారు, దాని వల్ల అధికార పార్టీ నీరసపడితే ఆపైన ఉత్సాహం తెచ్చుకుని టీడీపీ సైకిల్ ని జోరుగా తొక్కాలని చూస్తున్నారని అంటున్నారు. మరి జగన్ వేసే కార్డు ముక్కతో బాబు చెక్ చెబుతారా లేక జగన్ వేసే ముక్కతో షో అంటూ టీడీపీ ఆట కట్టిస్తారా అన్నది కొద్ది కాలంలోనే తేలనుంది అంటున్నారు.