Begin typing your search above and press return to search.

బాబు బెయిల్ పిటిషన్... హైకోర్టులో కీలక అప్ డేట్!

అదేవిధంగా... సుప్రీం కోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్‌ పై తీర్పు నవంబర్‌ 8వ తేదీన వెలువడనుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 10:50 AM GMT
బాబు బెయిల్  పిటిషన్... హైకోర్టులో కీలక అప్  డేట్!
X

స్కిల్‌ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండి 50 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఇందులో భాగంగా... మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై నిర్ణయం మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క సుప్రీంలో క్వాష్ పిటిషన్ తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో హైకోర్టులో వేసిన మద్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో మెయిన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు ఎప్పుడనేది మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

కాగా... స్కిల్‌ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిచారు. ఈ సమయంలో... చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌ గా వాదనలు వినిపించారు.

ఇందులో భాగంగా... చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తమ వాదనలు వినిపించారు! ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

మరోపక్క స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్‌ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్‌ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పై వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్‌ 31కి తీర్పు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు! ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అదేవిధంగా... సుప్రీం కోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్‌ పై తీర్పు నవంబర్‌ 8వ తేదీన వెలువడనుందని తెలుస్తుంది. ఇదే సమయంలో నవంబర్‌ 9వ తేదీన ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జరగనుంది. ఇక ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పీటీ వారెంట్‌ పై విచారణను ఏసీబీ కోర్టు నవంబర్‌ 10కి వాయిదా వేసింది!