Begin typing your search above and press return to search.

జూలైలో కొత్త టెన్షన్... భయపెడుతోన్న బాబా వంగా 'ఫ్యూచర్'!

జపాన్‌ కు చెందిన బాబా వంగా అంచనాలు తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 2:00 PM IST
జూలైలో కొత్త టెన్షన్... భయపెడుతోన్న బాబా వంగా ఫ్యూచర్!
X

జపాన్‌ కు చెందిన బాబా వంగా అంచనాలు తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె చెప్పిన అంచనాలు చాలా వరకూ నిజమయ్యాయని ఓ వర్గం బలంగా నమ్ముతుంటుంది. ఆమె అంచనాల కారణంగా తమ నిర్ణయాలు మార్చుకున్నవారు చాలా మందే ఉంటారు! ఈ క్రమంలో... జూలై 2025 కోసం ఆమె వేసిన అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

అవును... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా వంగా గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే. ఆమె చెప్పే జోస్యాలు చాలా వరకూ నిజమయ్యాయని అంటారు. ఈ నేపథ్యంలో.. 2025 ఏడాదికి సంబంధించిన ఆమె జోస్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా అశాంతి.. విధ్వంసాలకు మూలాలయ్యే అంచనాలు జూలై నెలలో ఉన్నాయని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది!

ఈ క్రమంలో.. జూలై నెలలో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు తన "ది ఫ్యూచర్ ఐ సా" అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీతో సహా పేర్కొన్నారు! ఇందులో భాగంగా... 2025 జూలై 5న మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు! ఈ విపత్తు కారణంగా ప్రపంచంలో పెను మార్పులు ఉండొచ్చని తెలిపారు!

ఈ క్రమంలో... జపాన్ - ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని ఆమె తెలిపారు. ఇది భారీ సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చని.. దీని తీవ్రత 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలలకంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు!

మరోవైపు జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినా... ఈ సమయంలో కుజుడు, రాహువు, కేతువుల అశుభ కలయిక ఉందని.. ఈ అశుభ కలయిక వల్ల దేశంలోనూ, ప్రపంచంలోనూ అల్లకల్లోలాలు జరిగే అవకాశం ఉందని.. కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది!