బీ-2 బాంబర్ వెనుక భారతీయ మేధావి... చైనా గూఢచారిగా ఎలా?
వివరాళ్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1994 జన్మించారు నోషిర్ షెరియర్జీ గోవాడియా. తన 19 ఏళ్ల ఏట ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:30 PMపశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో బీ-2 స్పిరిట్ బాంబర్స్ కీలక భూమిక పోషించాయి. అప్పటి నుంచి ఈ బీ-2 గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యలో వీటి తయారీ వెనుక భారత మేధావి ఉన్నారనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇరాన్ పై అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో మోహరించిన బీ-2 స్పిరిట్ బాంబర్ల స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో భారతదేశంలో జన్మించిన ఓ ఇంజినీర్ కీలక పాత్ర పోషించారు. ఆయన పేరు.. నోషిర్ షెరియార్జీ గోవాడియా. అయితే... గోవాడియా స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో చైనాకు సహాయం చేశారని ఎఫ్.బీ.ఐ. నిర్ధారించారు. దీంతో.. కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1994 జన్మించారు నోషిర్ షెరియర్జీ గోవాడియా. తన 19 ఏళ్ల ఏట ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. జూలై 25 - 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఈ క్రమంలో.. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్ లో బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ ను రూపకల్పన చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అలా పలు ప్రాజెక్టుల కోసం 1968 నుంచి 1986 వరకూ సుమారు రెండు దశాబ్ధాలు పని చేసిన గోవాడియా... తర్వాత అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థ నుంచి తప్పుకున్నారు. అనంతరం.. న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించారు. అయితే 1997లో ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు.
ఈ క్రమంలో అక్టోబర్ 15 - 2025న హవాయ్ లో ఆయన నివాసం ఉంటున్న విల్లాపై ఎఫ్.బీ.ఐ. దాడి చేసింది. ఈ సమయంలో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. అదే రోజు చైనాతో రహస్య సంబంధాలున్నాయనే కారణంతో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో... విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాడియాకు చైనాతో ఉన్న బంధం బయటపడింది!
ఇందులో భాగంగా... గోవాడియా 2003 - 2005 మధ్య చైనాకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు నిర్ధారించారు! దీనికోసం చైనా నుంచి కనీసం 1,10,000 డాలర్లు (సుమారు రూ.90 లక్షలు) పొందారని తేలింది. ఈ క్రమంలో అతని 14 అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో ఆయన దోషిగా తేలడంతో 2011లో కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
కాగా... బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన ఇంజినీర్ గోవాడియా.. బీ-2 బాంబర్ లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా.. విమానం ఎగ్జాస్ట్ ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది.