Begin typing your search above and press return to search.

అయ్యన్న ఫ్యామిలీకి మరో సీటు ?

ఇక విజయ్ రాజ్యసభ సభ్యత్వం 2032 జూన్ దాకా ఉంటుంది. అంటే ఆరేళ్ళు అన్న మాట. మరి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2029 లో రానున్నాయి. అంటే మరో మూడేళ్ళకు.

By:  Satya P   |   10 Jun 2026 9:23 AM IST
అయ్యన్న ఫ్యామిలీకి మరో సీటు ?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ టీడీపీ నేత, ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఒక సంతృప్తి అయితే కలిగింది. తాను పదవిలో ఉండగానే తన వారసుడికి అత్యంత కీలకమైన ఎంపీ సీటుని సంపాదించుకున్నామని ఆయన ఆనందంగా ఉన్నారు. తన రాజకీయ వారసత్వం ముందు ముందు కొనగాలని బలంగా కోరుకున్న అయ్యన్నకు టీడీపీ అధినాయకత్వం దీవెలను నిండుగా ఉన్నాయి. దాంతో ఆయన కుమారుడు విజయ్ కి రాజ్యసభ సీటు లభించింది. ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక గెలుపు అన్నది లాంచనమే అవుతోంది.

ఎంపీగానే ఉంటారా :

ఇక విజయ్ రాజ్యసభ సభ్యత్వం 2032 జూన్ దాకా ఉంటుంది. అంటే ఆరేళ్ళు అన్న మాట. మరి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2029 లో రానున్నాయి. అంటే మరో మూడేళ్ళకు. మరి ఆ ఎన్నికల్లో విజయ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఒక వేళ పోటీ చేయాలనుకుంటే అధినాయకత్వం ఆయనకు అనుమతి ఇవ్వాలి. రాజ్యసభ పదవీ కాలం మూడేళ్ళు ఉండగానే రాజీనామా చేసి రావాలనుకోవడం కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు అని అంటున్నారు. ఇక విజయ్ విషయానికి వస్తే మొదటి నుంచి పార్లమెంట్ మీదనే మోజు ఉందని కాబట్టి ఆయన ఎంపీగానే కొనసాగుతారు అని అంటున్నారు అలా అయితే అయ్యన్న వదిలేసే నర్శీపట్నం అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుంది అన్నది మరో పెద్ద చర్చ గా ముందుకు వస్తోంది అని అంటున్నారు.

రేసులో రెండవ కుమారుడు :

అయితే అయ్యనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు రాజేష్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. నియోజకవర్గంలో తన హవా చాటుకుంటున్నారు. దాంతో ఆయనకు నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ కోరవచ్చు అని అంటున్నారు. ఏనాడైతే టీడీపీ స్థాపించారో ఆనాటి నుంచి నర్శీపట్నం టికెట్ అయ్యన్న కుటుంబానికే ఇస్తూ వస్తున్నారు అలా ఇప్పటికి పది సార్లు అయ్యన్నకు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఇస్తే ఆయన ఏడు సార్లు గెలిచి మూడు సార్లు ఓడారు. నర్సీపట్నంలో టీడీపీ బలంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. పైగా అయ్యన్న కుటుంబం పోటీ చేస్తేనే విజయం దక్కుతుందని కూడా అంటున్నారు. దాంతో మరో సీటు ఆ ఫ్యామిలీకి దక్కుతుందా అన్నది అయితే చర్చగా ఉంది.

జనసేన ఫోకస్ :

అయితే ఇదే నర్సీపట్నం సీటు నుంచి పోటీకి జనసేన కూడా సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఆ పార్టీ కూడా నెమ్మదిగా అక్కడ విస్తరిస్తోంది. మరి టీడీపీ కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గతానికి కంటే ఎక్కువ సీట్లు జనసేన కోరుతుందని అంటున్నారు. మరి నర్సీపట్నం అసెంబ్లీ సీటు కనుక జనసేన పట్టుబడితే టీడీపీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఆ సమయంలో అయ్యన్న ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఒక కుటుంబానికి ఒక టికెట్ అన్న విధానం కనుక అమలు చేస్తే గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి రాకపోవచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే విజయ్ ఎమ్మెల్యేగా పోటీ పడాల్సి ఉందని రాజ్యసభకు వెళ్ళడం ఈ చిన్న వయసులో అవసరమా అన్నది కూడా తమ్ముళ్ళ నుంచి వస్తున్న ప్రశ్నగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.