Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... ఈ ఎంపీ బీరు ఎలా తాగారో చూశారా?

అవును... ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 May 2025 12:00 PM IST
వైరల్  వీడియో... ఈ ఎంపీ బీరు ఎలా తాగారో చూశారా?
X

ఓ ఎంపీ నేరుగా పార్లమెంట్ లోనే బీరు తాగిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇది ఆ దేశంలో ఓ ప్రసిద్ధ వేడుక కావడం! ఈ క్రమంలో ఆయన ఈ వేడుకను పార్లమెంట్ లో జరుపుకున్నారు. ఆయన పేరు మెక్ గిన్. ఆ దేశం ఆస్ట్రేలియా!

అవును... ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. పశ్చిమ ఆస్ట్రేలియా లేబర్ ఎంపీ కైల్ మెక్ గిన్.. పార్లమెంటులో డిఫరెంట్ గా వీడ్కోలు పలికారు. ఇందులో భాగంగా.. తన చివరి ప్రసంగాన్ని "షూయ్" చేస్తూ ముగించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... తనను తాను యాక్సిడెంటల్ పొలిటీషియన్ గా అభివర్ణించుకున్నారు. ఇలా ఫేర్ వెల్ సందర్భంగా తన ప్రసంగం ముగింపుకు ముందు అతడు తన బూట్లలో ఒకదాన్ని తీసి, అందులో బీరు పోసి తాగారు. ఈ సమయంలో గోల్డ్ ఫీల్డ్స్ లో ఉన్నవారు తన వీడ్కోలును అభినందిస్తారని వ్యాఖ్యానించారు.

కాగా... ఒకప్పుడు ఆయిల్ రిగ్ లో వంటవాడిగా పనిచేసిన కైల్ మెక్ గిన్.. తన ఇద్దరు సహోద్యోగులు మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విషయాన్ని తలచుకుంటూ.. 12వ తరగతి ఫెయిల్, టాటూలు వేయించుకున్న తన లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు!