Begin typing your search above and press return to search.

స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రముఖులు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే మాత్రం సంచలనంగా మారుతుంది.

By:  Tupaki Desk   |   17 March 2024 2:30 PM GMT
స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి
X

కాలం మారింది. అందుకు తగ్గట్లే సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రక్రతి ధర్మానికి విరుద్ధంగా అమ్మాయిని అమ్మాయి.. అబ్బాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవటం గడిచిన కొంతకాలంగా జరుగుతున్నదే. ఈ స్వలింగ వివాహాలకు పలు దేశాలు అధికారికం చేయటం తెలిసిందే. ప్రభుత్వాలు సైతం స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయటంతో ఈ తరహా పెళ్లిళ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలో 2017లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధం చేశారు.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రముఖులు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే మాత్రం సంచలనంగా మారుతుంది. తాజాగా అలాంటి సంచలానికి కేంద్రంగా మారారు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్. తాజాగా ఆమె మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన తొలి గే ఫిమేల్ పార్లమెంటేరియన్ అయినా పెన్నీ వాంగ్ తనతో సుదీర్ఘకాలంగా సహచర్య చేస్తున్న సోఫియా అల్లౌకేను పెళ్లి చేసుకున్నారు.

తన పెళ్లి విషయాన్ని ఆస్ట్రేలియా మంత్రి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. తన సామాజిక వర్గం.. తన స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకోటం సంతోషంగా ఉందన్న ఆమె.. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. రెండు దశాబ్దాలుగా వాంగ్.. అల్లౌకేలు కలిసి ఉంటున్నారు. శనివారం దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని ఆడిలైట్ లో జరిగిన కార్యక్రమంలో వారు ఒక్కటయ్యారు. ఇక.. పెన్నీ వాంగ్ విషయానికి వస్తే.. దక్షిణ ఆస్ట్రేలియా నుంచి సెనెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.