Begin typing your search above and press return to search.

జగన్ పై దాడి... పురందేశ్వరి డిమాండ్ - నాగబాబు కరెక్షన్!

ఆ సంగతి అలా ఉంటే... సీఎం వైఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు.. తన ఎక్స్ అకౌంట్ వేదికగా పరోక్షంగా చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 7:52 AM GMT
జగన్  పై దాడి... పురందేశ్వరి డిమాండ్ - నాగబాబు కరెక్షన్!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విజయవాడలోని "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో జరిగిన దాడి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే! ఈ దాడిపై వైసీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఇది టీడీపీ చేసిన దాడిగానే అభివర్ణిస్తున్నారు! మరోపక్క ఈ దాడిని ప్రధాని మోడీ నుంచి చాలా మంది నేతలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలూ తీవ్రంగా ఖండిస్తున్నారు!

ఈ సందర్భంగా జగన్ పై దాడి జరిగిన సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ చేసిన ట్వీట్ పైనా వైసీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. ఈ సమయంలో బీజేపీ, జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్ పై జరిగిన దాడి హేయమైన చర్యగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా... ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు!

ఆ సంగతి అలా ఉంటే... సీఎం వైఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు.. తన ఎక్స్ అకౌంట్ వేదికగా పరోక్షంగా చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా... "చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్... అస్సలు స్క్రిప్టెడ్ అని అనిపించడం లేదు.." అని రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది! అయితే ఈ ట్వీట్ పై నెట్టింట స్ట్రాంగ్ కామెంట్లు రావడంతో ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు చెబుతున్నారు!

ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత మరో ట్వీట్ చేశారు నాగబాబు. ఇందులో భాగంగా... "జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య.. జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం" అని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... "పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని, మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను." అంటూ నాగబాబు ముగించారు. ఈ ట్వీట్ ని జనసేన ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నట్లు తెలిపారు! ఈ నేపథ్యంలో డిలీట్ చేసిన ట్వీట్ కి సంబంధించినవిగా చెబుతున్న స్క్రీన్ షాట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి!!