Begin typing your search above and press return to search.

మెల్‌ బోర్న్‌ లో వేటకొడవళ్లతో దాడి...ఇండియన్ పై ఘోరం!

ఈ సందర్భంగా ర్యాన్ సింగ్ తో పాటు తన ఇద్దరు స్నేహితులపైనా దాడి చేసిన దుండగులు... ఆ ముగ్గురినీ మొబైల్ ఫోన్‌ లను ఇవ్వమని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 8:13 AM GMT
మెల్‌ బోర్న్‌ లో వేటకొడవళ్లతో దాడి...ఇండియన్ పై ఘోరం!
X

ఈమధ్యకాలం లో విదేశాళ్లో ఉంటున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు, మరి ముఖ్యంగా టీనేజర్స్ కి సంబంధించిన దారుణ విషయాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తుపాకీ కాల్పులు, కత్తి పోట్లు, బైక్ కోసం కొట్టి చంపడాలు... ఒకటేమిటి ఎన్నో సంఘటనలు నిత్యం వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి.

ఇదే సమయంలో తాజాగా మెల్ బోర్న్ లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఒక బాలుడి పై కొడవళ్లతో దాడికి పాల్పడింది ఒక ముఠా. ఈ దాడి లో ఆ బాలుడు తీవ్రంగా గాయాపడ్డాడు.. ఇది ఆ బాలుడి బర్త్ డే నాడు జరగడం గమనార్హం.

అవును... మెల్‌ బోర్న్‌ లోని టార్నీట్ సిటీ లో ఒక ఘోరం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన రియాన్ సింగ్ అనే 16 ఏళ్ల బాలుడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాస్కెట్‌ బాల్ ఆడుకుంటున్నాడు. ఆరోజు తన పుట్టినరోజు కావడంతో మరింత ఖుషీగా ఉన్నాడు. ఈ సమయంలో దాదాపు ఏడెనిమిది మంది వ్యక్తులు కొడవళ్లతో వారిపై అకస్మాత్తుగా దాడి చేశారు.

ఈ సందర్భంగా ర్యాన్ సింగ్ తో పాటు తన ఇద్దరు స్నేహితులపైనా దాడి చేసిన దుండగులు... ఆ ముగ్గురినీ మొబైల్ ఫోన్‌ లను ఇవ్వమని డిమాండ్ చేశారు. ఇదే సమయం లో నైక్ ఎయిర్ జోర్డాన్ స్నీకర్‌ లను ఇవ్వమని బలవంతం చేశారు.. అయితే అది అతను ఇప్పుడే అందుకున్న బహుమతి.

దీంతో రియాన్, అతని స్నేహితులు అనేకసార్లు కత్తిపోట్లకు గురయ్యారు.. ఫలితంగా వారి పక్కటెముకలు, చేతులు, వీపుల కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒక స్నేహితుడికి తల వెనుక భాగంలో కూడా బలమైన గాయమైంది. ఈ సమయంలో వీరిని నిలువుదోపిడీ చేసుకున్న దుండగులు అక్కడ నుంచి పారిపోయారు.

ఈ సందర్భంగా రియాన్ తల్లి.. ఈ సంఘటన పై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. రియాన్ పుట్టినరోజు ను సందర్భంగా అతడికి ఇష్టమైన చీజ్‌ కేక్‌ తో కుటుంబ విందును ప్లాన్ చేసిందని తెలిపారు. ప్రస్తుతం రియాన్, అతని స్నేహితులు ఆసుపత్రిలో కోలుకొంటున్నారు.

మరోపక్క ఈ సంఘటన కు సంబంధించి విక్టోరియా పోలీసులు స్పందించారు. సాయుధ దోపిడీ, కత్తితో దాడి ఘటన కు సంబంధించి 20 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దారుణమైన దాడికి బాధ్యులైన వారికి న్యాయం చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.