Begin typing your search above and press return to search.

మొబైల్‌ సేవల్లో అంతరాయం.. పరిహారం ఫిక్స్!

ఈ నేపథ్యంలో... ఏటీ & టీ, టీ-మొబైల్స్, వెరిజోన్ తో పాటు ఇతర మొబైల్ నెట్ వర్స్క్ లలో కనెక్టివిటీ ప్రాబ్లం వచ్చింది!

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:47 AM GMT
మొబైల్‌  సేవల్లో అంతరాయం.. పరిహారం ఫిక్స్!
X

ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని టెలికాం సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఏటీ & టీ, టీ-మొబైల్స్, వెరిజోన్ తో పాటు ఇతర మొబైల్ నెట్ వర్స్క్ లలో కనెక్టివిటీ ప్రాబ్లం వచ్చింది! ఈ మేరకు ఈ విషయాన్ని డౌన్ డిటెక్టర్ అనే నెట్ వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది. దీంతో కస్టమర్లకు పరిహారం అనే విషయం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఒక్కో కస్టమర్ కూ ఎంతెంత ఇస్తారనే విషయంపై కంపెనీలు ప్రకటలు చేస్తున్నాయి.

అవును... అమెరికాలో ని టెలికాం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో... లాస్ ఏంజిల్స్, షికాగో, న్యూయార్క్ సిటీ, హూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన ప్రాంతల్లో వినియోగదారులు తెల్లవారుజాము సమయంలో సిగ్నల్ ప్రాబ్లం ను ఫేస్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఒకే సమయంలో ఈ నెట్ వర్క్ లన్నింటిలోనూ, పలు ప్రాంతాల్లో సమస్యలు రావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో ఏటీ & టీ కంపెనీ పరిహారాన్ని ప్రకటించింది.

ఇందులో భాగంగా... దీనివల్ల ప్రభావితమైన తమ కస్టమర్లలో ఒక్కొక్కరికీ ఐదు డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తామని వెల్లడించింది. వచ్చే రెండు బిల్లింగ్ సైకిల్స్ లో ఈ మొత్తన్ని ఖాతాల్లో జమచేస్తామని ఏటీ & టీ కంపెనీ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రీ పెయిడ్ యూజర్స్ కి పరిహారం అందించే విషయంలో ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఆ ప్రత్యామ్నాయాలు ఏమిటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు!!

కాగా... ఏటీ & టీ, టీ - మొబైల్‌, వెరిజోన్‌ తో పాటు మరికొన్ని మొబైల్ నెట్ వర్క్ లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ అనే నెట్ వర్క్ ట్రాకింగ్ సైంట్ గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా ఒక్క ఏటీ & టీ కస్టమర్ల నుంచే సుమారు 31 వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. ఇదే సమయంలో... వెరిజోన్ కు వెయ్యి ఫిర్యాదులవరకూ వచ్చినట్లు వెల్లడించింది.