Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ పై స్పందించిన అచ్చెన్న... రియాక్షన్ వైరల్!

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 10:20 AM GMT
జూనియర్  ఎన్టీఆర్  పై స్పందించిన అచ్చెన్న... రియాక్షన్  వైరల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు. ఈ అరెస్టుపై పలు రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల్లోని నేతలు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరి స్పందించగా... సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇదే సమయంలో జాతీయస్థాయిలో ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లు స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పలువురు బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఇక వారితోపాటు కమ్యునిస్టులూ స్పందించారు. ఇక నందమూరి కుటుంబ సభ్యుల్లో కొంతమంది రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వకపోవడంపై చర్చ కొనసాగుతుంది.

అవును... చంద్రబాబు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో "ఆయన్ని నిత్యం అవమానపరిచి, అసలు ఆయన ఫోటోలు కనిపిస్తేనే చిరాకుపడి, ఆయన అభిమానులను పక్కకు ఈడ్చేయండి అని చెప్పిన వారు అరెస్టైతే ఏమిటి.. లోపలే శాస్వతంగా ఉంటే ఏమిటి.. జూనియర్ ఎందుకు స్పందించాలి" అనే ఎదురు ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో ఇదే విషయంపై అచ్చెన్నాయుడిని ప్రశ్నించింది మీడియా. అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా... "ఆయనను వెళ్ళి అడగవయ్యా.. నన్నడిగితే నేనేం చెబుతా.. ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగండి.. ఎవరినీ స్పందించాలని మేము అడగం" అని అన్నారు.

ఈ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. "మండుతున్నట్లుంది" అంటూ మీంస్ ట్రోల్ అవుతున్నాయి! మరోపక్క ప్రస్తుతం రాజకీయాలకే తాను దూరం అన్నట్టుగా ఉంటున్న జూనియర్... ప్రస్తుతం సైమా అవార్డుల ఫంక్షన్ కు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.