400 ఏళ్లుగా వర్షం అనేదే లేదు.. దక్షిణ అమెరికాలో శాపగ్రస్త గ్రహం!
దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో చుక్క నీరు లేదు.. వందల సంవత్సరాలుగా అసలు వర్షం అనేదే లేదు.. ఈ శాపానికి కారణం ఏమిటి? వివరాల్లోకి వెళితే... అమెరికా యుద్ధ వాంఛతో రగిలిపోతోంది.
By: Sivaji Kontham | 13 March 2026 9:22 AM ISTదక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో చుక్క నీరు లేదు.. వందల సంవత్సరాలుగా అసలు వర్షం అనేదే లేదు.. ఈ శాపానికి కారణం ఏమిటి? వివరాల్లోకి వెళితే... అమెరికా యుద్ధ వాంఛతో రగిలిపోతోంది. ఈ యుద్ధాలు ప్రపంచానికి మానవాళికి పెను ముప్పుగా పరిణమించడం ఖాయమని నిరూపణ అవుతోంది. అయితే దానికి ముందు తెలుసుకోవాల్సిన మరో విషయం ఇక్కడ ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో విస్తరించి ఉన్న అటకామా ఎడారి భూమి మీద అత్యంత వింతైన కఠినమైన ప్రాంతం. దీనిని చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఏదైనా మరో గ్రహం మీద ఉన్నామా అనే సందేహం కలగక మానదు. వందల ఏళ్లుగా ఇక్కడ ఒక్క చుక్క వర్షం పడని ప్రాంతాలు కూడా ఉన్నాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఎడారిలోని కొన్ని భాగాల్లో గత 400 ఏళ్లుగా వర్షం అనేదే కురవలేదు. అందుకే దీనిని భూమిపై ఉన్న అత్యంత పొడి ప్రాంతంగా పిలుస్తారు.
ఈ ఎడారి భౌగోళిక పరిస్థితులు అంగారక గ్రహాన్ని (మార్స్ ని) పోలి ఉంటాయి. ఇక్కడి నేల స్వభావం.. విపరీతమైన వేడి, తేమ లేని గాలి కారణంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు తమ రోవర్లను అంగారక గ్రహం మీదకు పంపే ముందు ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తాయి. అటకామాలోని `వాలె డి లా లూనా` (చంద్రుని లోయ) ప్రాంతం చూసేందుకు అచ్చం చంద్రుడి ఉపరితలంలాగే కనిపిస్తుంది. జీవరాశి మనుగడ సాగించడం ఇక్కడ దాదాపు అసాధ్యం.. అందుకే దీనిని `నిర్జీవ సామ్రాజ్యం` అని కూడా అంటారు.
అయితే ప్రమాదకర అటకామా ఎడారి ఖనిజ సంపదకు నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ (రాగి), లిథియం నిల్వలు ఇక్కడ ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీకి అవసరమైన బ్యాటరీల తయారీలో ఈ లిథియం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఇక్కడి ఆకాశం అత్యంత స్పష్టంగా ఉండటం వల్ల ప్రపంచంలోని శక్తివంతమైన టెలిస్కోపులను ఇక్కడే ఏర్పాటు చేశారు. విశ్వం అంతరాలను శోధించే ఖగోళ శాస్త్రవేత్తలకు అటకామా ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.
అయితే మానవత్వం, ప్రపంచ శాంతి కోణంలో ఆలోచిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. యుద్ధ వాంఛతో రగిలిపోయే అమెరికా వంటి అగ్రరాజ్యాలు, ఇలాంటి ఎడారి ప్రాంతాలను ఒయాసిస్సుల్లా మార్చే సాంకేతికతపై దృష్టి పెట్టడం లేదు. వినాశకరమైన ఆయుధాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే దేశాలు, ప్రకృతి శాపగ్రస్తమైన భూములను పునరుజ్జీవింపజేసే ఆలోచన చేయకపోవడం వల్లే అటకామా వంటి ప్రాంతాలు వందల ఏళ్లుగా అలాగే మిగిలిపోయాయి. తాజా వార్ నేపథ్యంలో దక్షిణ అమెరికా శాపం గురించి మరోసారి చర్చ సాగుతోంది. శత్రుత్వంతో సాగించే యుద్ధాలు చివరకు విధ్వంసాన్నే మిగిలిస్తాయనడంలో సందేహం లేదు. భీకర యుద్ధాలతో దేశాలు ఎడారులుగా మారే ప్రమాదం లేకపోలేదు.
ముఖ్యంగా ఇరాన్‌పై తాజాన్న యుద్ధ వాతావరణం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా సృష్టిస్తున్న అశాంతి ఆ దేశానికే శాపంగా మారే ప్రమాదం ఉంది. `కర్మ రిటర్న్స్` సిద్ధాంతం ప్రకారం.. అమెరికా చేస్తున్న దాడుల వల్ల నష్టం ఇరాన్ వరకే పరిమితం కాలేదు. గల్ఫ్ సర్వనాశనమైంది. అందుకే గల్ఫ్ దేశాలన్నీ వ్యూహాత్మకంగా ఏకమైతే పరిస్థితి తలకిందులవుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు గల్ఫ్ దేశాల మద్దతు పెరిగితే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, అమెరికా ఉనికిపై కోలుకోలేని దెబ్బ తీస్తుంది. యుద్ధం వల్ల కలిగే భారాన్ని రేపు అమెరికా అనుభవించక తప్పదు.
అంతిమంగా .. అటకామా ఎడారి ప్రకృతి వైచిత్రికి ప్రతీక అయితే.. ప్రస్తుత రాజకీయ యుద్ధాలు మానవ తప్పిదాలకు నిదర్శనం. ప్రకృతిని ప్రేమించి, ఎడారులను సైతం పచ్చదనంతో నింపాల్సిన మనిషి, స్వార్థం కోసం పచ్చని దేశాలను ఎడారులుగా మారుస్తున్నాడు. అమెరికా తన యుద్ధ వ్యూహాలను పక్కన పెట్టి శాంతి మార్గంలో పయనించకపోతే.. రేపు చరిత్ర పుటల్లో శత్రువుల కారణంగా ఆ దేశం కూడా ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ పై యుద్ధంలో అణు కేంద్రంపై జరిగిన దాడి కారణంగా ఇప్పుడు విశ్వం మొత్తం రేడియో ధార్మికతను అలుముకుంటోంది. దీని పర్యవసానం మనిషి తన అంతాన్ని తనకు తానే రాసుకోవడమే!
