Begin typing your search above and press return to search.

ప్రపంచ సంక్షోభాలకు పరిష్కారం అక్కడే.. చాలా మంది వెతుకుతున్నది దీనికోసమే..

నేడు ప్రపంచం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా సమయం నుంచి చాలా సమస్యలు భూమిని చుట్టుముట్టాయి.

By:  Tupaki Desk   |   4 Sept 2025 11:00 PM IST
ప్రపంచ సంక్షోభాలకు పరిష్కారం అక్కడే.. చాలా మంది వెతుకుతున్నది దీనికోసమే..
X

గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కానీ అది ఆయా పరిస్థితులు, వ్యక్తులను బట్టి మాత్రమే సాధ్యం అవుతుంది. నేడు ప్రపంచం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా సమయం నుంచి చాలా సమస్యలు భూమిని చుట్టుముట్టాయి. అతిపెద్ద ప్రళయం వచ్చి కోట్లాది మందిని బలికొంది. ఆ తర్వాత ఉక్రెయిన్-రష్యా వార్. ఆ తర్వాత భారత్-పాక్, ఇక ఇజ్రాయెల్ సమీపంలోని చాలా దేశాలతో వార్ చేస్తూనే ఉంది. ఇన్ని సమస్యలు ఎప్పుడు సమసిపోతాయని ప్రపంచ జనాభా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కానీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

భారత్ నుంచే ప్రాశ్చత్య దేశాలకు..

భూమిపై అత్యంత జ్ఞానం కలిగిన దేశం భారత్ మాత్రమే. ప్రపంచానికి ఎన్నో విలువైనవి ఇచ్చింది భారతదేశమే. ఎన్నో సమస్యల చిక్కుముడులు విప్పింది కూడా భారతే. అందుకే భారతదేశం అంటే ప్రాశ్చాత్యులు మోకరిల్లక తప్పదు. అదే భారతదేశం జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా ప్రపంచానికి అందించింది. కానీ పాశ్చాత్యులు మాత్రం దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేశారు. ఈ శాస్త్రం ఆధారంగానే ప్రపంచ ప్రళయాలను ముందే తెలుసుకునేవారు పూర్వీకులు. నేడు కూడా అలా తెలసుకునేందుకు వివిధ దేశాల పాలకులు ఆసక్తి చూపుతున్నారు.

ఆస్ట్రాలజీపై పెరుగుతున్న నమ్మకం..

నేడు జ్యోతిష్య శాస్త్రంపై ప్రపంచ జనాభాకు విశ్వాసం పెరుగుతోంది. భారత్ పక్కనే ఉన్న చైనా కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు చైనా కూడా రాబోయే ప్రళయాలను ముందుగానే అంచనా వేస్తూ సర్దుకుటుంది. 2019 నుంచి లేదా ఒకటి రెండు సంవత్సరాల్లో అతిపెద్ద రోగం సంభవించి ప్రపంచ జనాభా ఎక్కువ మొత్తంలో మరణిస్తారని ఆ సంవత్సరాని కంటే ముందే జ్యోతిష్యులు చెప్పారు. అలానే కొవిడ్ వచ్చింది. అయితే 2024 సమయంలో వచ్చే ఏడాది (2025) మొత్తం యుద్ధాల కాలం అని కూడా భారత జ్యోతిష్య పండితులు చెప్పారు. అలానే ఈ సంవత్సరం ఇప్పటికి రెండు మూడు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.

జ్యోతిష్య శాస్త్రం వైపునకు మొగ్గు..

ఈ ఘటనల తర్వాత ప్రపంచంలోని చాలా మంది ఆస్ట్రాలజీ వైపునకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం యూరప్, అమెరికాలో ఎక్కువ మంది దీన్నే ఆశ్రయిస్తున్నారు. టిక్ టాక్ ఇండియాలో బహిష్కరించారు. కానీ అమెరికాలో మాత్రం బహిష్కరించలేదు. అక్కడ టిక్ టాక్ లో ఆస్ట్రాలజీకి సంబంధించి వేలాది నుంచి లక్షలాది వీడియోలు దర్శనమిస్తున్నాయట. ఇక ఆన్ లైన్ లో అయితే #ఆస్ట్రాలజీ, #వార్ పదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయట.

అమెరికాలో టిక్ టాక్ వీడియోల్లో ఇవే అంశాలు..

అయితే టిక్ టాక్ లో కనిపించే వీడియోల్లో కొన్ని శాస్త్రానికి విరుద్ధంగా జరిగేవి ఉంటే.. కొన్ని మాత్రం ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ట్రంప్ మొదటి సారి గెలిచిన సమయంలో హిల్లరీ క్లింటన్ కొన్ని కామెంట్లు చేశారు. తాను జ్యోతిష్యురాలును కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించగలనని చెప్పారు. ఆ సమయంలో ఆమె యుద్ధాలు వస్తాయని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ జాతకంలో రాశుల మధ్య తేడాతో ఆయన ప్రతిస్పందనలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల కొందరు ఆస్ట్రానాజిస్ట్ చెప్పడం.. ఆ విధంగానే ట్రంప్ కూడా వ్యవహరించడం చూస్తే చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మవచ్చని అనుకుంటున్నారు.

భారత్ నమ్మకాన్ని విశ్వసిస్తున్న ప్రపంచం..

జ్యోతిష్యం గురించి ప్రపంచం ఏమనుకున్నా భారత్ మాత్రం ఎక్కువగా విశ్వసిస్తుంది. శిశువు పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క దశను శాస్త్రంతో ముడిపెడతారు. పుట్టిన గడియలు, వివాహం, చావు ఇలా ప్రతి గడియా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరగుతుందని నమ్ముతారు. అందుకు తగ్గట్లుగానే ముహూర్తాలు పెడతారు. ఇక అమెరికాలో జ్యోతిష్య శాస్త్రంను విశ్వసించే వారు కొంత మేర పెరిగినా 2017, 2024 మధ్య స్థిరంగా ఉన్నారని అనలిస్టులు చెప్తున్నారు. నమ్మే వారికి మాత్రం జాతకాలు ఓదార్పుగా అనిపిస్తాయని డాక్టర్ వాట్స్ చెప్పారు.