Begin typing your search above and press return to search.

పేమెంట్ యాప్సే కీలకమా ?

ఎన్నికలంటేనే సర్వం డబ్బుమయమన్న విషయం తెలిసిందే. డబ్బులేకపోతే పార్టీలు అభ్యర్ధులుగా ఎవరినీ ప్రకటించవన్న విషయం బహిరంగ రహస్యం

By:  Tupaki Desk   |   16 Nov 2023 12:30 PM GMT
పేమెంట్ యాప్సే కీలకమా ?
X

ఎన్నికలంటేనే సర్వం డబ్బుమయమన్న విషయం తెలిసిందే. డబ్బులేకపోతే పార్టీలు అభ్యర్ధులుగా ఎవరినీ ప్రకటించవన్న విషయం బహిరంగ రహస్యం. అభ్యర్ధులుగా ప్రకటించటం కాదు అసలు పరిశీలనలోకే తీసుకోవు డబ్బులేని నేతల పేర్లను. అలాంటిది టికెట్ వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇక డబ్బులు ఖర్చు చేయకుండా అభ్యర్ధులకు ఎలా సాధ్యం. డబ్బు ఖర్చులో ఈ పార్టీ ఆ పార్టీ అనిలేదు ప్రతి పార్టీ మరో పార్టీతో విపరీతంగా పోటీపడుతోంది. అందుకనే ఈ ఎన్నికల్లో డబ్బు ప్రమేయం విపరీతంగా పెరిగిపోతోంది.

ఇప్పటివరకు పట్టుబడిన డబ్బే సుమారు రు. 250 కోట్లుంది అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే పట్టుబడింది రు.250 కోట్లు మాత్రమే అంటే పట్టుబడకుండా పంపిణీ అయిపోతున్న మొత్తం ఎంతుంటుంది ? పట్టుబడిన దానికి సుమారు పది, ఇరవై రెట్లుంటుందనటంలో సందేహంలేదు. ఇంత పెద్దమొత్తంలో డబ్బు యధేచ్చగా పంపిణీ ఎలా అవుతోంది ? ఎలాగంటే పే మెంట్ యాప్స్ ద్వారానే అన్నది అర్ధమవుతోంది.

పే మెంట్ యాప్స్ లో ముఖ్యంగా పేటీమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి మరికొన్ని యాప్స్ కీలకంగా మారుతున్నాయి. బ్యాంకు టు బ్యాంకు ట్రాన్స్ ఫర్ అవుతున్న డబ్బు కూడా ఉన్నా దీని షేర్ తక్కువనే చెప్పాలి. బ్యాంకు ఖాతాలో రు. 50 వేలు జమైనా, వేరే ఖాతాకు ట్రాన్స్ ఫర్ అయినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే రు. 50 వేల లోపు బదిలీలపై నిషేధంలేదు. రు. 50 వేలపైన ట్రాన్స్ ఫర్ అయినా పట్టించుకోరు కానీ తరచూ ట్రాన్స్ ఫర్ అవుతుంటే మాత్రం అనుమానం వచ్చేస్తుంది.

ఎన్నికల సీజన్ కదా తరచూ ఒకే ఖాతానుండి ఇతర ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతుంటే నిఘా ఉంటుందనటంలో సందేహంలేదు. అందుకనే పేమెంట్ యాప్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. ఇదే సమయంలో మద్దతుదారుల దగ్గర వ్యక్తిగతంగా రు. 40 వేల వరకు ఇచ్చిపెడుతున్నారట. వీళ్ళు అవసరమైన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డైరెక్టుగా చేతికి ఇచ్చేస్తున్నారట. ఇక్కడ కూడా రు. 50 వేల లోపు డబ్బు చేతిలో ఉన్నా పోలీసులు పట్టుకునేందుకు లేదు. ఎందుకంటే అదేమంత పెద్ద మొత్తం కాదు కాబట్టే. కాకపోతే పట్టుకుంటే లెక్క చెప్పాల్సుంటుంది. చిన్న మొత్తమే కాబట్టి ఏదో ఒక లెక్క చెప్పేస్తారు.