Begin typing your search above and press return to search.

తెలంగాణ వారికి 2 రోజులే.. వాళ్లు మాత్రం 3వారాలు వెయిట్ చేయాలి

ఎన్నికల ప్రక్రియ ఎంత సుదీర్ఘంగా సాగినా ఫర్లేదు. ఒకసారి ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రం.. ఫలితం ఎప్పుడెప్పుడు వస్తుందా? అన్న ఎదురుచూపులు మామూలుగా ఉండవు

By:  Tupaki Desk   |   9 Oct 2023 5:00 PM IST
తెలంగాణ వారికి 2 రోజులే.. వాళ్లు మాత్రం 3వారాలు వెయిట్ చేయాలి
X

ఎన్నికల ప్రక్రియ ఎంత సుదీర్ఘంగా సాగినా ఫర్లేదు. ఒకసారి ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రం.. ఫలితం ఎప్పుడెప్పుడు వస్తుందా? అన్న ఎదురుచూపులు మామూలుగా ఉండవు. నిమిషాలు గంటల మాదిరి.. గంటలు.. రోజుల మాదిరి ఇబ్బంది పెడుతుంటాయి. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటం తెలిసిందే. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలకు నోటిఫికేషన్ ఒకే రోజు విడుదలైనప్పటికీ.. ఎన్నికల ప్రచారం.. పోలింగ్ జరిగే టైం వేర్వేరుగా ఉంటుంది.

ఎన్నికల ప్రక్రియ మొత్తంలో కీలకమైన పోలింగ్ విషయానికి వస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైంకు పూర్తి అవుతుంది. మొత్తం నాలుగు రాష్ట్రాలకు మిజోరంలో నవంబరు 7న పోలింగ్ పూర్తి అయితే.. మధ్యప్రదేశ్ లో పోలింగ్ నవంబరు 17న పూర్తి అవుతుంది. రాజస్థాన్ లో నవంబరు 23న పోలింగ్ పూర్తి అయితే.. తెలంగాణలో మాత్రం నవంబరు 30న పూర్తి అవుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబరు 3న జరుగుతాయి.

తెలంగాణలో పోలింగ్ నవంబరు 30న పూర్తి అయితే.. ఫలితాలు డిసెంబరు 3 మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే.. 30 సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ (ఆలస్యాలు కలుపుకొని) పూర్తి అయితే.. డిసెంబరు 1, 2 తేదీలు వెయిట్ చేస్తే.. 3 తారీఖు ఉదయం 9 గంటల నుంచి కౌంటింగ్ లెక్కల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. పోలింగ్ పూర్తి అయినప్పటి నుంచి ఫలితాల వెల్లడికి మధ్య గ్యాప్ 2 రోజులే కావటంతో.. పెద్ద టెన్షన్ ఉండదనే చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే మిజోరం ప్రజల పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి. నవంబరు 7న వారికి పోలింగ్ పూర్తి అయితే.. ఈవీఎం పెట్టెలు ఓపెన్ అయ్యేది డిసెంబరు 3. దగ్గర దగ్గర 26 రోజులు. అదే మధ్యప్రదేశ్ ప్రజలైతే 15 రోజులు.. రాజస్తాన్ ప్రజలు సైతం తొమ్మిది రోజుల పాటు ఫలితాల కోసం వెయిట్ చేస్తుండాలి. మిగిలిన మూడు రాష్ట్రాల వారితో పోలిస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం అది కాస్తా రెండు రోజులే కావటం భారీ రిలీఫ్ గా చెప్పొచ్చు. పేరుకు తెలంగాణలో ఎన్నికలే అయినప్పటికీ.. ఏపీ ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఎన్నికల ఫలితాల మీద ఆసక్తిని ప్రదర్శించటం ఖాయం.