Begin typing your search above and press return to search.

ఒక స్టీల్ బాల్ తైవాన్ ఆకాశహర్మ్యాన్ని ఎలా రక్షించింది?

దీంతో... ఆ కనస్ట్రక్షన్ వెనుక ఉన్న మాయ ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   5 April 2024 3:58 PM GMT
ఒక స్టీల్  బాల్  తైవాన్  ఆకాశహర్మ్యాన్ని ఎలా రక్షించింది?
X

ఇటీవల తైవాన్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. సుమారు 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల చాలా భవనాలు నేలమట్టమయ్యాయి! అయితే... అక్కడున్న ఆకాశహర్మ్యం "తైపీ 101" మాత్రం అతి తక్కువ నష్టంతో ఆ ప్రమాదం నుంచి బయట పడింది. దీంతో... ఆ కనస్ట్రక్షన్ వెనుక ఉన్న మాయ ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది.


అయితే... వినూత్న రూపకల్పన కారణంగా ఆ భవనం భూ ప్రకంపనలను తట్టుకుని నిలబడటానికి కారణ.. ఒక పెద్ద లోలకం అని చెబుతున్నారు! అవును... తైవాన్ లో ఇటీవల 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ... అక్కడున్న ఎత్తైన ఆకాశహర్మ్యం తపీ 101 మాత్రం నేలమట్టం కాకుండా నిలబడి ఉంది.


ఈ భవనం మధ్యలో ఒక భారీ లోలకం వేలాడ దీయబడి ఉంటుందట. ఇలా వేలాడ దీసిన లోలకం అనేది సుమారు 660 మెట్రిక్ టన్నుల ఉక్కు గోళం కాగా... ఇది భూమి నుండి 1,000 అడుగుల ఎత్తులో వేలాడదీయబడి ఉంది. అయితే... భూకంపం లేదా బలమైన గాలుల సమయంలో భవనం కదలికను ఎదుర్కోవడానికి ఈ లోలకం ఊగుతుందంట. తద్వారా భవనం ఊగడం అనే సమస్య సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు.


ఇదే సమయంలో... ఈ లోలకం 87 - 92 అంతస్తుల మధ్య వేలాడుతూ 41 ఉక్కు పొరలతో నిర్మించబడిందని నివేదిక పేర్కొంది. ఇది దాదాపు 18 అడుగుల వ్యాసం కలిగి ఉందని చెబుతున్నారు.

ట్యూండ్ మాస్ డంపర్ (టీఎండీ):

ఈ బాల్ సాంకేతిక నామం ట్యూన్డ్ మాస్ డంపర్ (టీఎండీ) కాగా.. ఇది భవనం అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన నిష్క్రియ వ్యవస్థ! ఈ భవనం వెబ్ సైట్ లో పోందుపరచబడిన వివరాల ప్రకారం... తైపీ 101లో అమర్చిన గోళాకార డంపర్ భూకంపాలు లేదా తుఫాన్ ల సమయంలో ముందుకు వెనుకకు కదులుతుందని పేర్కొంది. ఈ వినూత్న రూపకల్పన కారణంగానే ఆ ఆకాశహర్మ్యం అంత తీవ్రమైన భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడిందని చెబుతున్నారు.