Begin typing your search above and press return to search.

''ఇందిర‌మ్మ బతికుంటే.. బీజేపీని నిషేధించేవారు''

బీజేపీపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

By:  Garuda Media   |   15 Jun 2026 11:00 PM IST
ఇందిర‌మ్మ బతికుంటే.. బీజేపీని నిషేధించేవారు
X

బీజేపీపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ప్ర‌ధాని ఇందిర‌మ్మ జీవించి ఉంటే.. బీజేపీని దేశంలోనే లేకుండా చేశార‌ని.. లేక‌పోతే.. మావోయిస్టు పార్టీల మాదిరిగా నిషేధం అయినా విధించి ఉండే వార‌ని గెహ్లాట్ అన్నారు. దేశంలో ప్ర‌స్తుతం బీజేపీ ఒక్క పార్టీనే ఉండాల‌న్న రీతిలో రాజ‌కీయాలు చేస్తున్న తీరు ఇత‌ర పార్టీల‌కు.. ప్ర‌ధానంగా ప్రాంతీయ పార్టీల‌కు.. తీవ్ర ఆందోళ‌న‌కరంగా ఉంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు మంచిది కాద‌న్నారు.

ఇంటింటికీ..

ప్ర‌స్తుతం ఇంటింటికీ వ‌స్తున్న వారు..(స‌ర్ పేరుతో) కులం, మ‌తం, ప్రాంతం తెలుసుకుంటున్నార‌ని గెహ్లాట్ అన్నారు. త‌ద్వారా.. కేవ‌లం హిందువుల‌కు మాత్ర‌మే ఓట్ల‌ను ఉంచుతున్నార‌ని.. ఇత‌ర మ‌త‌స్థుల‌కు మా త్రం తీసేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. లౌకిక వాద దేశంలో ఇది ఎంత దార‌ణ‌మో ఆలోచించాల‌న్నారు. బీజేపీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆలోచ‌న చేయ‌లేద‌న్నారు. అన్ని పార్టీల స‌మాహార‌మే ప్ర‌జాస్వామ్యం గా భావించింద‌ని గెహ్లాట్ తెలిపారు. అందుకే.. బీజేపీ కూడా ఏర్ప‌డింద‌న్నారు.

కానీ, నేడు అదే బీజేపీ.. తాను త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌న్న ధోర‌ణిలో ప్రాంతీయ పార్టీల‌ను భ యోత్పాతానికి గురి చేసి.. వారి వెన్నువిరిచే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఇది ఏతర‌హా రాజ‌కీయమో.. ఇది ఏత‌ర‌హా ప్ర‌జాస్వామ్య‌మో ఆలోచించుకోవాల‌న్నారు. అయితే.. ఆయ‌న ఏ పార్టీ పేరును కూడా ఉటంకించ లేదు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ పార్టీ టీఎంసీలో తీవ్ర ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యం లోనే ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని తెలుస్తోంది.

ఇక‌, ముస్లింలు ఇత‌ర మైనారిట వ‌ర్గాలు ఈ దేశంలో జీవించ‌కూడ‌దా? అని గెహ్లాట్ ప్ర‌శ్నించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 80 పార్ల‌మెంటు స్థానాలు ఉంటే.. ఒక్క‌టి కూడా ముస్లింల‌కు ఇవ్వ‌కుండా కేవ‌లం హిందూత్వ అజెండాను.. మాత్ర‌మే బీజేపీ మోస్తోంద‌న్నారు. కేవ‌లం దేశంలో హిందువులు మాత్ర‌మే ఉన్నారా? లౌకిక వాదం ఏమైంది? అని నిల‌దీశారు. ``అందుకే.. చెబుతున్నా.. ఇందిర‌మ్మ జీవించి ఉంటే.. ఖ‌చ్చితంగా ఇలాంటి పార్టీని(బీజేపీ) నిషేధించేవారు.`` అని గెహ్లాట్ బిగ్గ‌ర‌గా వ్యాఖ్యానించారు.