Begin typing your search above and press return to search.

పిల్ల‌ల‌కు చ‌దువు చెబుతామ‌న్నా జ‌గ‌న్ స‌హించ‌లేదు: గ‌వ‌ర్న‌ర్ గ‌జ‌ప‌తి రాజు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన దారుణాలు త‌లుచుకుంటే బాధేస్తోంద‌ని గోవా గ‌వ‌ర్న‌ర్ పూస‌పాటి అశోక్ గ‌జప తి రాజు అన్నారు.

By:  Garuda Media   |   23 Feb 2026 6:51 PM IST
పిల్ల‌ల‌కు చ‌దువు చెబుతామ‌న్నా జ‌గ‌న్ స‌హించ‌లేదు: గ‌వ‌ర్న‌ర్ గ‌జ‌ప‌తి రాజు
X

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన దారుణాలు త‌లుచుకుంటే బాధేస్తోంద‌ని గోవా గ‌వ‌ర్న‌ర్ పూస‌పాటి అశోక్ గ‌జప తి రాజు అన్నారు. ''మా ఆధ్వ‌ర్యంలోని మాన్సాస్ ట్ర‌స్టు ద్వారా పిల్ల‌ల‌కు ఉచితంగా చ‌దువు చెబుతామ‌ని చెప్పినా.. మాపై క‌క్ష పెంచుకున్నారు. అనేక ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి దౌర్భాగ్యం దేశంలో ఎక్క‌డా చూడ‌లేదు.'' అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని మాన్సాస్ విద్యాసంస్థ‌ల్లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సోమవారం ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలు కూడా లేకుండానే నెయ్యి త‌యారు చేసే విధానం వైసీపీ హ‌యాంలో వెలుగు చూడ‌డం ప‌ట్ల అంద రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు. పాలు లేకుండా నెయ్యి త‌యారు చేయ‌డం ఏంట‌నేది త‌న‌కు కూడాఅంతు చిక్క‌లేద‌న్నారు. కేవ‌లం ర‌సాయ‌నాల‌తోనే నెయ్యిని త‌యారుచేసి ప‌ర‌మ ప‌విత్ర‌మైన శ్రీవారి ప్ర‌సాదాన్ని కూడా క‌ల్తీ చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

న‌న్ను జైలుకు పంపిస్తామ‌న్నారు..

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని తాను ప్ర‌శ్నించినందుకు కృష్ణ జ‌న్మ‌స్థానానికి(జైలు) పంపిస్తామ‌ని కొంద‌రు వైసీపీ నాయ‌కులు హెచ్చ‌రించార‌ని పూస‌పాటి గుర్తు చేశారు. కానీ, వారే ఇప్పుడు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార‌ని విమ‌ర్శించారు. పాల‌న‌ను, చ‌ట్టాల‌ను మంచి వారి చేతిలో పెడితే మంచి జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. గ‌త వైసీపీ హ‌యాంలో 14 ల‌క్ష‌ల మంది విద్యార్థులు స్కూళ్ల‌కు దూర‌మ‌య్యార‌ని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల‌ని కోరితే.. త‌న‌పై అక్క‌సు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పారు.

ఆయ‌న కూడా ఇక్క‌డే ..

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణపై పూస‌పాటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాన్సాస్ ట్ర‌స్టు స‌హా విద్యాసంస్థ‌ల‌పై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు చేసిన బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా.. త‌మ మాన్సాస్ విద్యాస్థ‌ల్లోనే చ‌దువుకున్నార‌ని గుర్తు చేశారు. అయితే.. ఆయ‌న కృత‌జ్ఞ‌త ఉందో లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ``అప్పులు మీవి.. ఆస్తులు మావి``అన్న‌ట్టుగా వైసీపీ నాయకులు వ్య‌వ‌హ‌రించార‌ని వ్యాఖ్యానించారు.