జగన్‌కు సైలెంట్ ప్రచారం.. కీలక నేత ఎంట్రీ ..!
అయితే.. దీనికి భిన్నంగా ఎంఐఎం అధినేత వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నాయకులు గుర్తించిన విషయం.
By: Tupaki Desk | 3 July 2025 8:00 AM ISTఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోం ది. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా.. వైసీపీ దూకుడు పెంచింది. ప్రజల మధ్యకు వెళ్తోంది. గత ఎన్నికల కు ముందు ఇచ్చిన చంద్రబాబు హామీలను గుర్తు చేస్తోంది. తద్వారా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ సమయంలో జగన్‌కు అనుకూలంగా చాపకింద నీరులా మరో కీలక నేత ఎంట్రీ ఇచ్చారు.
తరచుగా రాష్ట్రానికి వస్తున్న ఆయన.. చంద్రబాబుకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. ఆయనే హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎం పార్టీ అధినేతగా ఆయన ముస్లిం సామాజిక వర్గం తో తరచుగా ఏపీ లో భేటీ అవుతున్నారు. కర్నాలు, గుంటూరు, కడప జిల్లాల్లోని మైనారిటీ వర్గాలతో భేటీ అవుతున్న ఆయన ప్రధానంగా వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు తన సామాజిక వర్గాన్ని ఏకం చేయాల్సి ఉంది.
అయితే.. దీనికి భిన్నంగా ఎంఐఎం అధినేత వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నాయకులు గుర్తించిన విషయం. పరోక్షంగా వైసీపీకి ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. మైనారిటీ ముస్లింలకు కూటమి ప్రభు త్వం ఏమీ చేయడం లేదని.. ముస్లింలకు అన్యాయం జరుగుతోం ద ని గతంలో ఇచ్చిన పథకాలను ఇప్పు డు అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఇదేసమయంలో వ క్ఫ్ బోర్డు విషయంలో చంద్రబాబు కూటమి పార్టీల తరఫున అనుకూలంగా వ్యవహరించారని ప్రచారం చేస్తున్నారు.
తద్వారా ఆయనపై వ్యతిరేకత పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారానికి రెండు సార్లు ఏపీకి వస్తున్న అసదుద్దీన్ ద్వారా.. మైనారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే జరుగు తున్నాయి. అయితే.. నేరుగా వైసీపీని ప్రస్తావించని ఒవైసీ.. కూటమిని ఓడించాలని మాత్రం పిలుపునిస్తు న్నారు. అంటే.. ఒకరకంగా జగన్ కు ఆయన సైలెంట్ ప్రచారం చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇది ఏమేరకు కూటమికి మైనస్ అవుతుంది? ఏమేరకు.. జగన్‌కు ప్లస్ అవుతుందన్నది చూడాలి.
