Begin typing your search above and press return to search.

జైలు నుంచి ఢిల్లీ పాలన... తీహార్ జైల్ ఎక్స్ పీఆర్వో కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆం ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది

By:  Tupaki Desk   |   1 April 2024 11:30 PM GMT
జైలు నుంచి ఢిల్లీ పాలన... తీహార్ జైల్ ఎక్స్ పీఆర్వో కీలక వ్యాఖ్యలు!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆం ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో... ఆయా రెండు వారాలపాటు తీహార్ జైలులోనే ఉండనున్నారు. ఈ మేరకు ఆయనను సోమవారం సాయంత్రం భారీ భద్రత నడుమ జైలుకు తరలించారు. ఈ సమయంలో.. జైలు నుంచే పాలన అని ప్రకటించిన విషయం ఆసక్తిగా మారింది. దీనిపై తీహార్ జైలు మాజీ పీఆర్వో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో... ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలించడం అనేది అంత సులువైన విషయం కాదని.. అందుకు చాలా రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందని అంటున్నారు తీహార్ జైలు మాజీ పీఆర్వో సునీల్ గుప్తా.

ఇందులో భాగంగా... జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపే సదుపాయం ఇప్పటివరకూ ఆ జైలులో లేదని చెప్పిన సునీల్ గుప్తా... కేబినెట్ మీటింగ్స్, పబ్లిక్ ని కలవడం, గవర్నర్ తో మాట్లాడటం వంటివి కుదరవని తెలిపారు. ఇదే సమయంలో ఫోన్ కూడా ఉండదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సీఎం ఆఫీసు ఏర్పాటు చేయడం అనేది దాదాపు అసాధ్యం అని సునీల్ గుప్తా చెబుతున్నారు. మరి దీనిపై న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!

ఇక సోమవారం తీహార్ జైలుకు తరలించబడిన కేజ్రీవాల్ కు రెండో నంబర్ గదిని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉండగా.. ఆయన ఒకటో నంబరు గదిలో ఉన్నారు! ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఐదో నెంబర్, మరో ఆప్ నేత సత్యేందర్ జై ఏడో నెంబర్ గదిలో ఉన్నారు!