Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... 2024 ఏపీ ఫలితాలపై ఏఐ అంచనా ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 4:09 AM GMT
బిగ్  బ్రేకింగ్... 2024 ఏపీ ఫలితాలపై ఏఐ అంచనా ఇదే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని టీడీపీ - జనసేన బలంగా భావిస్తుండగా... ఈ దెబ్బతో ఏపీలో ప్రతిపక్షాలు అనే టాపిక్ లేకుండా చూసుకోవాలని వైసీపీ భావిస్తుంది! ఈ సమయంలో ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడించగా.. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తన అంచనాను వెల్లడించింది.

అవును... ఏపీలో రసవత్తర రాజకీయానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ప్రతీ రోజూ ఏపీలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రతీ సీనూ క్లైమాక్స్ లా అన్నట్లుగా... ప్రతీ రోజూ ఏదో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమవుతూనే ఉంది! ఈ సమయంలో తాజాగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఏఐ చాట్ జీపీటీ కోపైలట్.. రానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు వెల్లడించింది! ఇందులో భాగంగా వైసీపీకి గుడ్ న్యూస్ చెప్పింది!

మైక్రోసాఫ్ట్ కో పైలట్ రానున్న ఏపీ ఎన్నికలకు సంబంధించి తాజాగా అంచనాలు వెలువరించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది! కోపైలట్ ఆల్గారిథం, ప్రజల సెంటిమెంట్, గ్రౌండ్ లెవెల్ వ్యూహాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో స్థిరంగా ఖశ్చితత్వాన్ని ప్రదర్శిస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి రానున్న ఎన్నికల్లో 49.14శాతం వరకూ ఓట్లు సాధించి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని మోడల్ ప్రీ పోల్ సర్వే చెబుతున్న నేపథ్యంలో... వీటితోపాటు రాజకీయ విశ్లేషణలు, ఇతర ఎన్నికలలో వాటి వాటి ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకుని కోపైలట్ తన అంచనాను నిశితంగా పరిశీలిస్తుందని చెబుతున్నారు.

ఈ సమయంలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన అంచనాలపై సంశయాన్ని వ్యక్తపరుస్తూ, దాని విశ్వసనీయతను ప్రశ్నిస్తుంటే... మరికొంతమంది మాత్రం కోపైలట్ డేటా అధారిత విధానంపై నమ్మకాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోపైలట్ జోస్యం ఏమేరకు నిజమవుతుందనేది వేచి చూడాలి!