Begin typing your search above and press return to search.

తప్పు చేసిన రోబో.. ఒకరి ప్రాణాన్నిఅడ్డంగా తీసేసింది

మొత్తానికి మనిషికి యంత్రానికి మధ్యనున్న తేడాను సున్నితంగా చెప్పిన ఈ మూవీ చాలామందిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:01 AM GMT
తప్పు చేసిన రోబో.. ఒకరి ప్రాణాన్నిఅడ్డంగా తీసేసింది
X

ఆ మధ్యన ఒక మలయాళ మూవీ తెలుగు వారికి పాపులర్ అయ్యింది. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన ఈ మూవీ కరోనా కాలంలో అందరూ మాట్లాడుకునేలా చేసింది. విదేశాల్లో ఉండే కొడుకు.. తన తండ్రిని చూసుకోవటానికి ఒక రోబోను తయారు చేసి పంపటం.. దాన్ని చూసి చిరాకు పడిన తండ్రి.. తర్వాతి కాలంలో దానితో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పర్చుకోవటం కనిపిస్తోంది. అయితే.. ఆ రోబో ప్రోగ్రామింగ్ లో తేడాతో తప్పుగా వ్యవహరిస్తుందని చెప్పినా ఆ తండ్రి వినడు. మొత్తానికి మనిషికి యంత్రానికి మధ్యనున్న తేడాను సున్నితంగా చెప్పిన ఈ మూవీ చాలామందిని ఆకర్షించింది.

ఈ సినిమాలో రోబోను తయారు చేసిన ప్రోగ్రామింగ్ లో దొర్లిన తప్పులకు మనుషుల ప్రాణాల్ని ఎలా తీస్తుందన్న విషయాన్ని చూపించారు. దక్షిణ కొరియాలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్నిచూస్తే.. ఈ సినిమా చప్పున గుర్తుకు రావటం ఖాయం. రోబో సాయంతో పని చేసే యంత్రం ఒక వ్యక్తిని కన్వేయర్ బెల్టు మీద పడేయటం ద్వారా అతని ప్రాణాలు పోయిన విషాద ఉదంతం ఒకటి సంచలనంగా మారింది.

యంత్రం ఎప్పటికి విచక్షణ ఉన్న మనిషితో సమానం కాదన్న విసయాన్ని మరోసారి రుజువు చేసింది. ఒక సంస్థలోని ప్యాకింగ్ విభాగంలో పారిశ్రామిక రోబోలను వినియోగిస్తున్నారు. ఇవి సెన్సర్ల సాయంతో కూరగాయల్ని నింపిన పెట్టెల్ని గుర్తించి వాటిని కన్వేయర్ బెల్ట్ మీద పెడతాయి. అయితే.. రోబోలో తలెత్తిన సాంకేతిక లోపంతో తనకు దగ్గర్లో ఉన్న వ్యక్తిని కూరగాయల పెట్టెగా భావించింది.

అతన్ని కన్వేయర్ బెల్ట్ మీద పడేసింది. ఆ వ్యక్తిని ఒడిసి పట్టుకోవటంలో బలాన్ని ప్రదర్శించిన రోబో కారణంగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోబో చేసిన మిస్టేక్ ను గుర్తించి.. గాయాల బారిన పడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతడి ప్రాణాల్ని కాపాడలేకపోయారు. రోబో చేసిన తప్పునకు మనిషి ప్రాణం పోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.