'ఆరావళి'- మోడీకి రాజకీయ సెగ: ఏంటో తెలుసా?
ఆరావళి పర్వతాలు.. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదుకుని ఉంటాం. ప్రస్తుతం మరిచిపోయి కూడా ఉంటాం.
By: Tupaki Desk | 25 Dec 2025 9:00 PM ISTఆరావళి పర్వతాలు.. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదుకుని ఉంటాం. ప్రస్తుతం మరిచిపోయి కూడా ఉంటాం. అయితే.. తాజాగా ఆరావళి పర్వతాల వ్యవహారం.. రాజకీయ దుమారానికి దారి తీసింది. అంతేకాదు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఫలితంగా.. ఇప్పుడు జాతీయస్థా యిలో `ఆరావళి` పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనేది చూద్దాం..
ఆరావళి అంటే..
ఉత్తర భారత దేశంలో 670 కిలో మీటర్ల పొడవున విస్తరించిన పర్వతాలను ఆరావళి(సుదీర్థంగా వరుసగా పేరుకున్న కొండలు)గా పిలుస్తారు. ఈ పర్వతాలు... నైరుతిగా విస్తరించి.. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఉన్నాయి. ఢిల్లీలో మొదలయ్యే ఈ పర్వతాలు.. హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు ఉంటాయి. వీటి వల్ల ఆయా రాష్ట్రాలకు మేలు జరుగుతోందన్నది శాస్త్రజ్ఞులు చెబుతున్న మాట. అందుకే.. వీటికి దేశ పర్వత శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.
ఏం జరిగింది?
ఈ పర్వతాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ముట్టుకోలేదు. కానీ.. గత ఏడాది తొలిసారి.. ఆరావళి పర్వత సానువుల్లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇస్రో శాటిలైట్ చిత్రాలను కూడా సేకరించారు. వీటి ద్వారా.. ఆయా పర్వత ప్రాంతాల్లో.. అపారమైన సహజ సంపద ఉందని.. ముఖ్యంగా బంగారం, ఖనిజాలు, పెట్రోల్‌లో వినియోగించే ప్రత్యేక పదార్థం కూడా ఉందని తెలుసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలు జరిపేందుకు వీలుగా కేంద్రం గత ఏడాది చివరిలో కీలక నిర్ణయం తీసుకుంది. కానీ, బయటకు వెల్లడించలేదు.
ఈలోగా.. ఆరావళి పర్వత సానువుల్లోవ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, ఎస్సీ సామాజిక వర్గాలను అక్కడి నుంచి తరిమేశారు. దీనికి నక్సల్స్, తీవ్రవాదుల అంశాలను చూపుతున్నారు. కాగా.. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న సామాజిక ఉద్యమకారులు.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం ముదురుతున్న క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయానికి చెప్పిన కారణం భిన్నంగా ఉంది.
ఏం చెప్పారంటే..
ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఆరావళీ పర్వతాల వద్ద గనుల తవ్వకాలను నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం మేరకు ఆరావళీ పర్వతాల వద్ద పూర్తిస్థాయిలో గనుల తవ్వకాలను నిషేధించనున్నారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న ఆరావళీ పర్వత ప్రాంతాల్లో ఈ నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు. ఇదీ.. సంగతి! అయితే.. ఈ వ్యవహారంపైనా అనుమానాలు ఉన్నాయని పలువురు సామాజిక వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
