Begin typing your search above and press return to search.

చంద్రబాబును చెప్పుతో కొడతాం... కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం!

అవును... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ అరకు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:46 AM GMT
చంద్రబాబును చెప్పుతో కొడతాం... కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం!
X

కార్యకర్తలకు కోపం వస్తే ఏ పార్టీ మనుగడ అయినా ప్రశ్నార్థకం అవుతుందనేది తెలిసిన విషయమే. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముఖగా ఉంటారు. వారు ఆగ్రహించి, అడ్డం తిరిగితే ఆ నాయకుడి పని అయినా.. ఆ పార్టీ పనైనా పరిసమాప్తం అయిపోద్దనే చెప్పుకోవాలి. జెండా మోసే కార్యకర్తలకు విలువ ఇస్తేనే ఏ నాయకుడైనా, పార్టీ అయినా మనుగడ సాగించ గలుగుతుంది. అయితే తాజాగా కొంతమంది టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోతూ ఆ పార్టీ అధినేతను చెప్పుతో కొడతామనేవరకూ వెళ్లారు.

అవును... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ అరకు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. నమ్మించి మోసం చేస్తున్నారంటూ ఫైరయిపోయారు. తొలుత నినాదాలతో మొదలుపెట్టిన కార్యకర్తలు... చంద్రబాబును చెప్పుతో కొట్టక పోతే తన పేరు పలానా కాదంటూ ఓ కార్యకర్త చెప్పు చేతపట్టి శపథం చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీంతో... కార్యకర్తలు ఎంతగా విసిగిపోయే ఆ స్థాయిలో ఫైరవుతానే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు అరకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా... సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. దీంతో వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా ఆయన చేయలేకపోయారనే కామెంట్లు టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి!

ఈ సమయంలో తమను మోసం చేసిన చంద్రబాబును చెప్పుతో కొడతామని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత అబ్రహాంకు తీవ్ర అన్యాయం చేశారంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అబ్రహాంకు ఆఖరి వరకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఫైరయ్యారు. ఈ సందర్భంగా అబ్రహాంకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాగా... మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ తనయుడే ఈ అబ్రహాం. 2009లో అరకు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సోమ... 2014లో వైసీపీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. సెప్టెంబరు 23, 2018న తెలుగుదేశం పార్టీలో చేరిన కిడారి సర్వేశ్వరరావుతో కలిసి విశాఖపట్టణంలోని మన్యం అడవుల గుండా వెళ్తుండగా లివిరిపుట్టు వద్ద మావోయిస్టుల చేతిలో హతమయ్యారు.

అనంతరం ఆయన కుమారుడు అబ్రహాంకు ఆఖరి వరకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని.. తమను మోసం చేసిన చంద్రబాబును చెప్పుతో కొడతామని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.