Begin typing your search above and press return to search.

ఆ సీట్లు వైసీపీకే రిజర్వ్...టీడీపీ మాటేంటి...?

ఈ సీట్లలో 2019 ఎన్నికల్లో చూస్తే వైసీపీ మొత్తం ఎస్సీ రిజర్వ్ సీట్లలో 27ని గెలుచుకుంది. టీడీపీ ఒకటి, జనసేన మరోటి గెలుచుకున్నాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:18 AM GMT
ఆ సీట్లు వైసీపీకే రిజర్వ్...టీడీపీ మాటేంటి...?
X

ఏపీలో వైసీపీ బలం ఎంత అంటే చాలానే అని చెప్పాలి. 2011 నుంచి వైసీపీ తన బలాన్ని పెంచుకుని వస్తోంది. అది కాస్తా 2019 ఎన్నికల నాటికి 50 శాతం ఓటు బ్యాంక్ గా 151 సీట్లుగా 22 ఎంపీ సీట్లుగా మారింది. ఇక సోషల్ ఇంజనీరింగ్ లో వైసీపీ పై చేయి సాధించింది. అలా కనుక చూసుకుంటే వైసీపీకి ట్రెడిషనల్ గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గంతో పాటు 2019 నాటికి బీసీలు కూడా పెద్ద ఎత్తున తోడు అయ్యారు.

వైసీపీకి ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లలో తిరుగులేని బలం ఉంది. అక్కడ టీడీపీ ఎంతగా పోటీ పడినా పోరాడినా మాత్రం ఫలితం పెద్దగా ఉండడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఎస్సీ రిజర్వ్ సీట్లు 29 ఉన్నాయి. అలాగే ఎస్టీ రిజర్వ్ సీట్లు 7 ఉన్నాయి. ఈ సీట్లలో 2019 ఎన్నికల్లో చూస్తే వైసీపీ మొత్తం ఎస్సీ రిజర్వ్ సీట్లలో 27ని గెలుచుకుంది. టీడీపీ ఒకటి, జనసేన మరోటి గెలుచుకున్నాయి.

ఇక ఎస్టీ సీట్లు ఏడింటినీ వైసీపీ స్వీప్ చేసి పారేసింది. ఇక్కడ టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. 2024 నాటికి పరిస్థితి ఏంటి అన్నది చూస్తే కనుక పెద్దగా తేడా లేదు అని అంటున్నారు. అయితే గతంలో మాదిరిగా టోటల్ 36కి 34 సీట్లు వైసీపీకి రాకపోవచ్చు అని అంటున్నారు. అయితే అది కాస్తా 30 లోపుకి చేరుకుంటుందని అంటున్నారు.

ఈసారి ఏడు ఎస్టీ సీట్లలో ఒకే ఒక సీటు వైసీపీకి డౌట్ గా ఉందిట. అదే పోలవరం సీటు అంటున్నారు. మిగ్ల్లిన ఆరింటినీ వైసీపీ గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు. ఎస్సె సీట్లు తీసుకుంటే 29లో ఒక అయిదారు సీట్లు డౌట్లో ఉన్నాయని అంటున్నారు. అక్కడ క్యాండిడేట్స్ ని మార్చి టోటల్ గా విక్టరీ కొట్టాలని వైసీపీ చూస్తోంది. అయితే రాజోలులో మళ్లీ జనసేన జెండా ఎగరేయడానికి చూస్తోంది.

అలాగే మంత్రి పినిపె విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో కూడా వైసీపీకి డౌట్ గా ఉందిట. గుంటూరులో వేమూరులో మంత్రి నాగార్జున సీటు కూడా డౌటే అంటున్నారు. ఇక ఆదిమూలం సురేష్ సీటు ఎర్రగొండపాలేం లో కూడా కొంచెం చూసుకోవాలని అంటున్నారు.

ఇలా కొన్ని సీట్లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో అభ్యర్ధులను మార్చి బలమైన వారిని దింపడం ద్వారా 36కు 36 సీట్లు గెలుస్తామని వైసీపీ చెబుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.