Begin typing your search above and press return to search.

ఎక్కువైందేమో బాస్ : గుడివాడ, అచ్చెన్న అతిశయాలు !

వైసీపీ ఏపీలో మరోసారి గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు మంత్రులు బల్లగుద్ది మరీ చెబుతారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 3:51 AM GMT
ఎక్కువైందేమో బాస్ : గుడివాడ, అచ్చెన్న అతిశయాలు !
X

వైసీపీ ఏపీలో మరోసారి గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు మంత్రులు బల్లగుద్ది మరీ చెబుతారు. ఇక టీడీపీ అయితే ఓడిపోతుంది అనే అంటుంది. అది నాచురల్. ఈ మధ్య దాకా టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు బిగ్ సౌండ్ చేస్తూ వచ్చారు. అలాంటిది ఆయన ఇపుడు కొత్త పాట అందుకున్నారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ రాదుట.

అంటే టోటల్ గా 175 సీట్లనూ టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని అచ్చెన్నాయుడు అంటున్నారు. వై నాటి 175 అన్న జగన్ నినాదమే అచ్చెన్న తమ పార్టీ స్లోగన్ గా తీసుకున్నారు అన్న మాట. బాబు అరెస్ట్ అయినపుడు కూడా అచ్చెన్న టీడీపీ గెలుపు ఖాయం సీట్లు 160కి తగ్గవని అన్నారు. కాని చిత్రంగా ఇపుడు 175కి ఎగబాకేశారు.

మరి ఎందుకింత ధీమా ఆయనలో వచ్చింది. అలాగే జగన్ సైతం గెలవరు అని ఎలా అనుకుంటున్నారు. అసలు టీడీపీకి ఇంత వేవ్ ఉంటే జనసేనతో పొత్తులు ఎందుకు. బాబు అరెస్ట్ కాక ముందు అరెస్ట్ అయిన తరువాత రాని మార్పు సడెన్ గా జనంలో ఆయన ఏమి చూశారు. ఇత్యాది ప్రశ్నలు అన్నీ వరసబెట్టి వస్తున్నాయి.

అయితే అచ్చెన్న ఆవేశంతో చేస్తున్న ప్రకటనగా దీని చూడాలా లేక అతి ధీమాగా చూడాలా లేక వైసీపీ ఒక్క సీటూ గెలవకూడదు అన్న పంతంగా చూడాలా అన్నదే ఎవరికీ అర్ధం కావడంలేదుట. అచ్చెన్నాయుడు తన పార్టీ గురించి చెప్పుకుంటారు. అయితే అది అతి అయింది అనుకుంటే వైసీపీ మంత్రులు కీలక నేతలు కూడా వెరైటీగా అదే అతి ధీమాను ప్రదర్శిస్తున్నారు.

వైసీపీ ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తుందని గతంలో వచ్చిన 151 సీట్లకు మించి వై నాట్ 175 అన్నట్లుగా మొత్తం గెలుస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. జగన్ కంటే శక్తివంతుడైన నేత ఏపీ రాజకీయాల్లో మరొకరు లేరని కూడా గుడివాడ సూత్రీకరిస్తున్నారు.

ఇక అచ్చెన్న సొంత జిల్లా శ్రీకాకుళానికే చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఇదే రకంగా మట్లాడుతున్నారు. ఈసారి వైసీఈ విధయం తధ్యమని ఆయన ఘంటాపధంగా చెప్పేశారు. ఏపీ అభివృద్ధి చెందాలీ అంటే మళ్లీ జగనే సీఎం కావాలని కూడా ఆయన అంటున్నారు.

వైసీపీ విజయం మీద కొందరు, పరాజయం మీద కొందరు ఇలా జోస్యాలు చెబుతూంటే అసలు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ రియాల్టీసేనా అన్న డౌట్ అయితే సగటు జనాలలో కలుగుతోంది. వై నాట్ 175 అని ఎవరు అన్నా జనాలు ఒకే పార్టీకి మొత్తం సీట్లు ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అలాగే టీడీపీకి 2014లో బాబు అనుభవం కార్డుతో పాటు విభజన ఏపీకి ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ గా సీనియర్ నేత ట్యాగ్ తోడు అయ్యాయి.

పవన్ కొత్త పార్టీ కొత్త మోజు జోడు అయ్యాయి. 2014లో నరేంద్ర మోడీ మహేంద్ర జాలం బీజేపీ రూపంలో కాసింది. ఇంత గట్టిగా అన్నీ బిగించుకుని మరీ ఎన్నికల గోదాలో దిగితేనే 105 సీట్లకు మించి రాలేదు. ఇపుడు 160 అని టీడీపీ అంటోంది. అది కూడా అయిదేళ్ల తమ గత ప్రభుత్వ పాలన జనాలు చూసిన తరువాత కూడా ఓటేస్తారు ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తారని నమ్మకంతో. అలాగే వైసీపీ గతం కంటే అధికార బలంతో ఉందని తెలిసి పొత్తులు పెట్టుకుంటూ ఈ బిగ్ నంబర్ ని వల్లె వేస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

అదే తీరున వైసీపీ కూడా అయిదేళ్ల పాలన తరువాత సహజంగానే యాంటీ ఇంకెబెన్సీ ఉంటుంది. అలా ఉన్న దాన్ని అధిగమించి గెలుపు సాధించడం ప్రధానం. సీట్లు తగ్గినా మళ్ళీ విజయం తమదే అని వైసీపీ అనడంలేదు, వై నాట్ 175 అంటోంది. అంటే ఇది కూడా అతి ధీమాయే అంటున్నారు. ఎన్నికల వేళ ఇలంటి అతిశయాలు అటూ ఇటూ చాలానే చూడాలని జనాలు అంటున్నారు. ఏది ఏమైనా ఏపీకి 175 సీట్లు మాత్రమే ఉన్నాయని అందుకే అక్కడే ఆగిపోయారని లేకపోతే ఇంకా పెద్ద నంబరే చెబుతారు అన్న సెటైర్లూ పడుతున్నాయి.