Begin typing your search above and press return to search.

ఆర్మీ శిక్షణలో యువరాణి... అక్కడ వారసత్వం ఉచితం కాదు!

అయితే స్పెయిన్ లో మాత్రం సింహాసనం దక్కించుకోవడం అంటే కేవలం వారసత్వం ఉంటే సరిపోదు.. దానికి పలు టెరంస్ అండ్ కండిషన్స్ ఉంటాయి.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:30 PM GMT
ఆర్మీ శిక్షణలో యువరాణి... అక్కడ వారసత్వం ఉచితం కాదు!
X

సాధారణంగా వారసత్వం అంటే... పెద్దాయన దిగగానే చిన్నాయన ఆ కుర్చీ ఎక్కేయడం అని చాలా మంది నమ్మకం.. పలు చోట్ల అది సర్వసాధారణం.. మరికొన్ని చోట్ల అది మేన్ డేటరీ కూడా! ఇది సాధారణంగా రాజకీయాల్లో కనిపిస్తుంటుందని అంటుంటారు. అయితే స్పెయిన్ లో మాత్రం సింహాసనం దక్కించుకోవడం అంటే కేవలం వారసత్వం ఉంటే సరిపోదు.. దానికి పలు టెరంస్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ అర్హతలు సంపాధించుకోవడం అక్కడ కపల్సరీ!


అవును... కండిషన్స్ అనుకున్నా.. బాధ్యతలు అనుకున్నా.. అవగాహనా లేకుండా అందలం ఎక్కితే దేశ భవిష్యత్తుకు ఇబ్బంది అనే సూత్రం తాలూకు నిబంధన అనుకున్నా.. స్పెయిన్ లో సింహాసాన్ని అధిరోహించాలంటే ఆ రాజవంశీకులు మిలటరీలో శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో ముడేళ్లపాటు కఠిన శిక్షణ తీసుకోవాలి. ఈ విషయంలో ఆడా, మగా అనే తారమత్యాలేవీ ఉండవు. ప్రస్తుతం స్పెయిన్ యువరాణి అదే పనిలో ఉన్నారు.


అక్టోబర్‌ నెలతో 18ఏళ్లు నిండటంతో స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్ తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. అనంతరం ఆమె రాణిగా అడుగులు వేసేందుకు తప్పనిసరి అయిన మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడంలో భాగంగా... తన శిక్షణకు సంబంధించిన తొలి దశను అదిగమించి తదుపరి దశలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది.


తాజాగా తన తల్లిదండ్రులైన క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపేతోపాటు 16 ఏళ్ల సోదరి ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమీకి వచ్చిన ప్రిన్సెస్ లియోనోర్... దేశాధినేతగా తన భవిష్యత్తు కోసం అధికారికంగా మూడు సంవత్సరాల కఠనమైన సైనిక శిక్షణను తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా... ఆమె తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన కెప్టెన్ జనరల్‌ గా ఆమెకు సెల్యూట్‌ చేశాడు.

ప్రస్తుతం స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌ గా పనిచేస్తున్న కింగ్ ఫెలిపే... గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ పొందాడు. ఇక తన తండ్రి సెల్యూట్ అనంతరం తన సూట్‌ కేస్‌ ను వెంటతీసుకుని, ఎంట్రీ పుస్తకంలో తన పేరుతో పాటు సంతకం చేసి లోపలికి వెళ్లింది.

స్పెయిన్ యువరాణి విద్యాభ్యాసం:

తన ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్‌ లో ప్రారంభించిన లియోనార్... మాధ్యమిక విద్య పూర్తయిన అనంతరం యునైటెడ్ కింగ్‌ డంలోని వేల్స్‌ లోని యూ.డబ్ల్యూ.సీ. అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రాంను అభ్యసించింది. ఆ తర్వాత.. 17 ఆగస్టు 2023న, లియోనార్ జనరల్ మిలిటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించింది.

ఈ క్రమంలో ఫస్ట్ స్టేజ్ దాటుకున్న ఆమె తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధం అయింది. ఈ సమయంలో ఆమె 2023-2024 విద్యా సంవత్సరానికి లేడీ క్యాడెట్‌ గా శిక్షణ పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు. అనంతరం 2024 - 25లో మారిన్ నావల్ మిలిటరీ స్కూల్‌ లో మిడ్‌ షిప్‌ మ్యాన్‌ గా ట్రైనింగ్ షిప్‌ లో పని చేస్తుందని.. ఇక 2025 నుంచి 2026 వరకు ఎయిర్ అకాడమీలో ఎన్‌ సైన్ విద్యార్థిగా చేరి అక్కడ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్మీతో తన కోర్సులను పూర్తి చేస్తారు.

160 సంవత్సరాల తర్వాత మరోసారి..!:

ప్రస్తుతం కఠినమైన శిక్షణలో ఉన్న ఈమె అది దాటుకుని సింహాసనాన్ని అధిరోహిస్తే.. ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. అదేమిటంటే... 1833 నుంచి 1868 వరకు పాలించిన తన 4వ తరం నానమ్మ అయిన ఇసాబెల్లా-2 తర్వాత స్పెయిన్ రాణి అవుతుంది. అంటే... సుమారు 160 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక మహిళ మరోసారి యువరాణిగా అడుగుపెట్టబోతుందన్నమాట.